MS DHONI: ఇండియన్ టూరిజం.. ధోని అప్పుడే చెప్పాడు.. పాత వీడియో వైరల్

చాలా కాలం క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేశీయ టూరిజం గురించి చెప్పారు. తాను తక్కువగా ట్రావెల్ చేస్తుంటానని, అయితే, ఒకవేళ అవకాశం ఉంటే ముందుగా ఇండియాలోని టూరిస్టు ప్లేసులకే ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు.

  • Written By:
  • Updated On - January 9, 2024 / 04:45 PM IST

MS DHONI: ప్రస్తుతం దేశమంతా లక్షద్వీప్ సహా ఇండియాలోని టూరిస్టు ప్లేసులపై చర్చిస్తోంది. దేశంలోని అందమైన ప్రాంతాలు ఉండగా.. వాటికి ప్రాధాన్యం ఇవ్వకుండా విదేశాలకు వెళ్లడం సరికాదని.. ఇకపై ఇండియాలోని టూరిస్టు ప్లేసులకే ప్రాధాన్యం ఇవ్వాలని చాలా మంది భావిస్తున్నారు. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. అలాగే భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మాల్దీవ్స్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే ఉద్దేశంతో కూడా ఈ ప్రచారం ఊపందుకుంది.

VIRAT KOHLI: రోహిత్, కోహ్లీ వచ్చేశారు.. టీ ట్వంటీల్లోకి రీ ఎంట్రీ

దీంతో అందరూ దేశీయ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు సిద్ధమయ్యారు. లక్షద్వీప్ వంటి దేశీయ సుందర ప్రదేశాల్ని తీర్చిదిద్దాలని డిసైడయ్యారు. అయితే, ఈ విషయంలో స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ అందరికంటే ముందున్నాడు. చాలా కాలం క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేశీయ టూరిజం గురించి చెప్పారు. తాను తక్కువగా ట్రావెల్ చేస్తుంటానని, అయితే, ఒకవేళ అవకాశం ఉంటే ముందుగా ఇండియాలోని టూరిస్టు ప్లేసులకే ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ఇండియాలోనే చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. త్వరలో తన కుటుంబంతో టూర్ ప్లాన్ చేస్తున్నట్లు, భారత్ నుంచే ట్రావెలింగ్ ప్రారంభించాలనుకుంటున్నట్లో ధోని వెల్లడించారు. దేశంలోని సుందర ప్రదేశాల్ని చూడాలనుకుంటున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ధోని ప్రపంచంలోని అన్ని దేశాలను సందర్శించగల స్థాయిలో ఉన్నప్పటికీ.. ముందుగా ఇండియలోనే టూర్ చేయాలని భావించడంపై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశంపై, ఇక్కడి పరిస్థితులపై ధోనికి ఉన్న అభిమానాన్ని తన మాటల్లో చెప్పాడంటూ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. మరోవైపు సినిమా, క్రీడా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు.. లక్షద్వీప్‌ టూరిజానికి మద్దతుగా ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.