Rohit Sharma: రోహిత్‌ను కెప్టెన్‌గా కొనసాగించాల్సింది.. ముంబై నిర్ణయాన్ని తప్పుపట్టిన యూవీ

ఐపీఎల్ 2024 సీజన్ వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్‌కు చెందిన హార్దిక్ పాండ్యాను క్యాష్ ట్రేడింగ్ డీల్ ద్వారా జట్టులోకి తెచ్చుకున్న ముంబై ఇండియన్స్.. అతనికి జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించింది.

  • Written By:
  • Publish Date - March 15, 2024 / 11:17 AM IST

Rohit Sharma: ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో కెప్టెన్‌ను మారుస్తూ ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తప్పుబట్టాడు. మరో సీజన్ పాటు రోహిత్ శర్మను కెప్టెన్‌గా కొనసాగించాల్సిందని, అతనికి డిప్యూటీగా హార్దిక్ పాండ్యాను నియమించాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2024 సీజన్ వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్‌కు చెందిన హార్దిక్ పాండ్యాను క్యాష్ ట్రేడింగ్ డీల్ ద్వారా జట్టులోకి తెచ్చుకున్న ముంబై ఇండియన్స్.. అతనికి జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించింది.

Devara: గోవాలో ల్యాండింగ్.. బాహుబలి బాటలో దేవర..

జట్టు భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని ముంబై ఇండియన్స్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కెప్టెన్సీ మార్పు ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే లక్షల మంది అభిమానులు ఆ జట్టు సోషల్ మీడియా ఖాతాలను అన్‌ఫాలో చేసి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కెప్టెన్సీ మార్పుపై రోహిత్ శర్మ మౌనంగా ఉన్నా.. అతని సతమణి రితికా సజ్దే ఫ్రాంచైజీ తీరును తప్పుబట్టింది. ఇక యువరాజ్ సింగ్ సైతం ఫ్రాంచైజీ నిర్ణయాన్ని విమర్శించాడు. ఐదు సార్లు టైటిల్ అందించిన సారథిని పక్కనపెట్టడం చాలా పెద్ద నిర్ణయమన్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచాడనీ, మరో సీజన్ వరకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా కొనసాగించాల్సిందని వ్యాఖ్యానించాడు.

అతనికి డిప్యూటీగా హార్దిక్ పాండ్యాను నియమించి జట్టు ఆట తీరును పరిశీలించాల్సిందని అభిప్రాయపడ్డాడు. గుజరాత్ టైటాన్స్ జట్టుకు ముంబై ఇండియన్స్‌కు చాలా తేడా ఉందన్న యూవీ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్‌ను నడిపించడం అంత సులువైన పని కాదన్నాడు. టాలెంట్ విషయంలో హార్దిక్ పాండ్యాకు డోకా లేదనీ, ముంబై ఇండియన్స్ సారథ్యం మాత్రం అతనికి సవాల్‌గా ఉంటుందన్నాడు.