WTC Final 2023: టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్‌లోని ఓవల్ మైదానంలో ఈ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ నెల 7 నుంచి 11 వరకు మ్యాచ్ జరుగుతుంది. వర్షం లేదా ఇతర కారణాల వల్ల మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడితే, మరో రోజు పొడిగిస్తారు.

  • Written By:
  • Publish Date - June 6, 2023 / 12:20 PM IST

WTC Final 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ బుధవారం (జూన్ 7) నుంచి ప్రారంభం కానుంది. ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్‌లోని ఓవల్ మైదానంలో ఈ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ నెల 7 నుంచి 11 వరకు మ్యాచ్ జరుగుతుంది. వర్షం లేదా ఇతర కారణాల వల్ల మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడితే, మరో రోజు పొడిగిస్తారు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. దీని ప్రకారం టాప్-2లో ఉన్న ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తోంది ఐసీసీ. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్ కైవసం చేసుకునేందుకు ఇరు జట్లూ సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ ప్రసార హక్కులకు సంబంధించి స్టార్‌ స్పోర్ట్స్‌ 1, స్టార్‌స్పోర్ట్స్‌ 2, స్టార్‌స్పోర్ట్స్‌ 1 హిందీ, స్టార్‌స్పోర్ట్స్‌ 1 హెచ్‌డీ ఛానళ్లలో మ్యాచ్ చూడొచ్చు. స్థానిక భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది. ఓటీటీలో చూడాలనుకుంటే డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో మాత్రమే అవకాశం ఉంది. దీనికి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రీమియం, సూపర్‌, సూపర్‌ ప్లస్ యాడ్‌ఫ్రీ ప్లాన్లను సబ్‌స్రైబ్‌ చేసుకుని మ్యాచులు చూడొచ్చు. ఈ టోర్నీకి సంబంధించి భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఛటేశ్వర్ పుజారా, విరాట్‌ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్‌, అజింక్య రహానె, కేఎస్‌ భరత్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, జయదేశ్ ఉనద్కత్‌.
స్టాండ్‌బై ఆటగాళ్లు: యశస్వీ జైశ్వాల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ముకేశ్‌ కుమార్‌

ఆస్ట్రేలియా జట్టు: ప్యాట్‌ కమిన్స్‌, కామెరాన్‌ గ్రీన్‌, స్కాట్‌ బొలాండ్‌, అలెక్స్‌ కేరీ, ట్రావిస్ హెడ్‌, మార్కస్‌ స్టాయినిస్‌, మార్నస్‌ లబుషేన్, జోష్‌ హేజిల్‌వుడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, ఉస్మాన్‌ ఖవాజా, నేథన్‌ లైయన్‌, డేవిడ్‌ వార్నర్‌, టాడ్‌ మర్ఫీ, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌
స్టాండ్‌బై ఆటగాళ్లు: మిచెల్‌ మార్ష్‌, మాథ్యూ రెన్షా