WTC Final: గద కాదు అది.. ప్రపంచ స్థాయి గుర్తింపుకు ప్రతీక..

సాధారణంగా అంతర్జాతీయ ఆటల్లో మొమెంటో, కప్, మెడల్ లాంటివి బహూకరించడం చూస్తూనే ఉంటాం. అలాంటిది వింతగా గదను బహూకరిస్తే ఎలా ఉంటుంది. అలాంటి వింత సాహసం చేసింది ఐసీసీ. ఈ గద వెనుక కథేంటో చూసేద్దాం పదండి.

  • Written By:
  • Publish Date - June 7, 2023 / 07:55 PM IST

ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ క్రికెట్ ఫైనల్ లో అడుగుపెట్టింది టీం ఇండియా. అందులో భాగంగా ఆసిస్ తో తలబడుతోంది. అయితే 2021లో జరిగిన డబ్ల్యూటీసీ మ్యాచ్ లో టీం ఇండియాపై కివీస్ మ్యాచ్ గెలిచి ఈ గద ను కైవసం చేసుకుంది. గద తో పాటూ భారీగా నజరానా అందుకుంది. అప్పట్లో అడుగు దూరంలో ఓటమి రుచి చూసిన భారత్ ఈ సారైనా ఆసిస్ పై నెగ్గి ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనకంటూ గుర్తింపును సాధిస్తుందో లేదో చూడాలి. ఇందుకోసం ఇరు జట్లు పోటా పోటీగా బరిలో దిగాయి. విజయం కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇండియన్ క్రికెట్ అభిమానులు మాత్రం ఈసారి గదను ఎలాగైనా దక్కించుకోవాలని ఆశపడుతున్నారు.

ఒకప్పుడు క్రికెట్ ర్యాంకింగ్లో ముందు వరుసలో ఉండే జట్టుకు గదను అందించేవారు. కానీ ఇప్పుడు ఆట తీరు మారింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో గెలిచిన వారికి బహుకరిస్తున్నారు. దీనితో పాటూ విజయం సాధించిన టీం కు 1.6 మిలియన్ డాలర్ల ఫ్రైజ్ మనీ కూడా అందిస్తారు. రన్నరప్ గా నిలిచిన జట్టుకు 8 లక్షల డాలర్లు ఇస్తారు. ఈ గద ను ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ 2000 సంవత్సరం నాటి నుండి ఇవ్వడం ప్రారంభించింది. ట్రావెన్ బ్రౌన్ అనే డిజైనర్ దీనిని తయారుచేశారు. దీనిని ఈ వింతైన ఆకారంలో రూపొందించేందుకు గల కారణాలను కూడా వెల్లడించారు.

గద ప్రత్యేకత ఇదే..

గద ను సరికొత్త మోడల్, అందమైన డిజైన్ లో రూపుదిద్దేందుకు నాకు స్పూర్తినిచ్చిన సంఘటన ఒకటి ఉంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఆటలో ఎవరైతే గెలుపొందుతారో ఆ టీం లోని ఆటగాళ్లు కొందరు స్టంప్ ను తీసుకొని ఆనందంగా స్టేడియం మొత్తం ఎగురుతూ సంబరాలు చేసుకుంటారు. ఆ దృశ్యాన్ని చూసి గదను తయారు చేసేందుకు స్పూర్తిని పొందినట్లు తెలిపారు. అయితే గద లాంటి ఆకారం వచ్చేందుకు మూలం ఒకటి ఉంది. క్రికెట్ ఆటకు ప్రదానమైనది బంతి. ఆ బంతి క్రికెట్ ప్రపంచ స్థాయిని తెలియజేస్తుంది. అందుకే స్టెంప్ కు బంతిని జతకలిపి గద ఆకారాన్ని రూపొందించినట్లు బ్రౌన్ వివరించారు. ఇక ఈ గద హాండిల్ కు రిబ్బన్ ను చుట్టి ఉంటారు. ఇది విజయానికి సంకేతం అని చెప్పుకొచ్చారు.

ఇది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు ఉన్న అరుదైన విలువ, గౌరవం అని ఈ గద కథ గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు ఔరా.. అనుకోక మానరు.

T.V.SRIKAR