WTC ఫైనల్ రేస్.. భారత్ ఇంకా ఎన్ని గెలవాలంటే ?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ భారత్ ను ఊరిస్తోంది. గత రెండు పర్యాయాలు ఫైనల్ చేరినప్పటకీ ఛాంపియన్ గా నిలవలేకపోయింది. ఒకసారి కివీస్ , మరోసారి ఆసీస్ టీమిండియా జోరుకు బ్రేక్ వేశాయి.

  • Written By:
  • Publish Date - September 12, 2024 / 06:12 PM IST

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ భారత్ ను ఊరిస్తోంది. గత రెండు పర్యాయాలు ఫైనల్ చేరినప్పటకీ ఛాంపియన్ గా నిలవలేకపోయింది. ఒకసారి కివీస్ , మరోసారి ఆసీస్ టీమిండియా జోరుకు బ్రేక్ వేశాయి. ఇప్పుడు మరోసారి టైటిల్ పై కన్నేసిన రోహిత్ సేన ఆ దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో మిగిలిన జట్ల కంటే ముందే ఉంది. అధికారికంగా ఫైనల్ చేరాలంటే టీమిండియా ఇంకా కొన్ని మ్యాచ్ లు గెలవాల్సి ఉంది. ఈ సైకిల్ లో మన జట్టు ఇంకా 10 టెస్టులు ఆడాల్సి ఉండగా… కనీసం ఐదింటిలో ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. స్వదేశంలో ఐదు టెస్టులు ఆడనుండడం కలిసొచ్చే అంశం. బంగ్లాదేశ్ తో రెండు, న్యూజిలాండ్ తో మూడు టెస్టులు ఆడనుండగా… తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదు మ్యాచ్ లు ఆడుతుంది.

వీటిలో ఐదు గెలిస్తే ఫైనల్ బెర్త్ ఖాయమవుతుంది. అలాగే భారత్, ఆసీస్ మధ్య జరిగే ఐదు టెస్టుల సిరీస్ రెండు జట్ల అవకాశాలను డిసైడ్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక మిగిలిన జట్లలో న్యూజిలాండ్ , ఇంగ్లాండ్ వెనుకబడ్డాయి. శ్రీలంకలో 2, భారత్‌లో 3 టెస్టులు ఆడాల్సి ఉన్న కివీస్‌.. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతుంది.వీటిలో కనీసం ఆరు గెలిస్తే తప్ప న్యూజిలాండ్ కు ఛాన్స్ లేదు. ఉపఖండపు పిచ్ లపై న్యూజిలాండ్ కు గెలుపు అంత సులభం కాదు. ఇక శ్రీలంక చేతిలో ఓటమితో ఇంగ్లాండ్ అవకాశాలు దెబ్బతిన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ భారత్, ఆసీస్ మధ్యే ఉంటుందని అంచనా వేస్తున్నారు.