Yashasvi Jaiswal: విశాఖలో తొలిరోజు టీమిండియా జోరు.. జైశ్వాల్ శతకంతో భారీస్కోర్

రోహిత్, గిల్, అయ్యర్ త్వరగానే ఔటైనా.. జైశ్వాల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్‌ రోహిత్‌తో కలిసి 40 పరుగులు, గిల్‌తో 49, శ్రేయాస్ అయ్యర్‌తో 90 పరుగులు, రజత్ పటిదార్‌తో 70 పరుగులు చేసి, కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

  • Written By:
  • Publish Date - February 2, 2024 / 05:51 PM IST

Yashasvi Jaiswal: విశాఖ టెస్టులో టీమిండియా భారీస్కోర్ దిశగా సాగుతోంది. తొలిరోజు రోహిత్‌సేన ఆధిపత్యం కనబరిచింది. వికెట్లు పడినప్పటికీ మంచి స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్.. సిరాజ్‌కు విశ్రాంతినిచ్చి ముకేశ్ కుమార్‌ను తీసుకుంది. అలాగే గాయపడిన జడేజా, రాహుల్ ప్లేస్‌లో కుల్‌దీప్ యాదవ్, రజత్ పటిదార్ వచ్చారు. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సెంచరీతో దుమ్మురేపాడు. రోహిత్, గిల్, అయ్యర్ త్వరగానే ఔటైనా.. జైశ్వాల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్‌ రోహిత్‌తో కలిసి 40 పరుగులు, గిల్‌తో 49, శ్రేయాస్ అయ్యర్‌తో 90 పరుగులు, రజత్ పటిదార్‌తో 70 పరుగులు చేసి, కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

CHIRANJEEVI: సారీ అన్నయ్య.. నాతో చిరంజీవిని తిట్టించింది వాళ్లే.. నిజం చెప్పిన రైటర్‌ చిన్నికృష్ణ

తొలి సెషన్‌లోనే రోహిత్ శర్మ, గిల్ ఔటైనప్పటకీ.. జైశ్వాల్ కీలక భాగస్వామ్యాలు జట్టుకు మంచి స్కోర్ అందించాయి. స్పిన్‌కు కాస్త సహకరిస్తున్న పిచ్‌పై జైశ్వాల్ చక్కని ఇన్నింగ్స్ ఆడి ఆకట్టుకున్నాడు. 151 బంతుల్లో 13 ఫోర్లు, మూడు సిక్సర్లతో సెంచరీ సాధించాడు. జైశ్వాల్ సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకోవడం హైలెట్‌గా నిలిచింది. టెస్ట్ కెరీర్‌లో అతనికిది రెండో శతకం. అలాగే 2023-25 వరల్ట్ టెస్టు ఛాంపియన్ షిప్‌లో రెండు సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. శ్రేయస్ అయ్యర్ 27 పరుగులకు ఔటవగా.. అరంగేట్రం చేసిన రజత్ పటిదార్ ఆకట్టుకున్నాడు. 3 ఫోర్లతో 32 రన్స్‌కు ఔటవగా.. అక్షర్ పటేల్, శ్రీకర్ భరత్ కూడా పర్వాలేదనిపించారు. హోంగ్రౌండ్‌లో ఆడుతున్న భరత్‌ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు.

23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 17 పరుగులకు ఔటయ్యాడు. తర్వాత జైశ్వాల్, అశ్విన్ మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్లకు 336 పరుగులు చేసింది. జైశ్వాల్ 179 , అశ్విన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 2, రిహాన్ అహ్మద్ 2, హార్ట్‌లీ 1 వికెట్ పడగొట్టారు. రెండోరోజు తొలి సెషన్ కీలకం కానుంది. మరో 100 నుంచి 150 పరుగులు జోడిస్తే మ్యాచ్‌పై భారత్ పట్టుబిగించే అవకాశముంటుంది.