రాజస్థాన్ ఫ్యూచర్ కెప్టెన్ అతనే రేసులో ముందున్న ఓపెనర్

యువక్రికెటర్ల నైపుణ్యానికి చక్కని వేదికగా నిలిచే టోర్నీ ఐపీఎల్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. నిజానికి రంజీ క్రికెట్ తో జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చే పరిస్థితుల నుంచి ఇప్పుడు ఐపీఎల్ తోనే టీమిండియాలో చోటు దక్కించుకుంటున్నారు.

  • Written By:
  • Publish Date - September 27, 2024 / 09:04 PM IST

యువక్రికెటర్ల నైపుణ్యానికి చక్కని వేదికగా నిలిచే టోర్నీ ఐపీఎల్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. నిజానికి రంజీ క్రికెట్ తో జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చే పరిస్థితుల నుంచి ఇప్పుడు ఐపీఎల్ తోనే టీమిండియాలో చోటు దక్కించుకుంటున్నారు. అయితే యువక్రికెటర్లను ప్రోత్సహించడంలో రాజస్థాన్ రాయల్స్ ఎప్పుడూ ముందుంటుంది. జట్టులో స్టార్ ప్లేయర్స్ ఉన్నా కూడా యువ క్రికెటర్లకే జట్టు పగ్గాలు అప్పగిస్తుంటుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం సంజూ శాంసన్ రాయల్స్ ను లీడ్ చేస్తుండగా… ఫ్యూచర్ కెప్టెన్ ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ రేసులో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ముందున్నట్టు సమాచారం.

2020 సీజన్ లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన జైశ్వాల్ గత నాలుగు సీజన్లలోనూ అద్భుతంగా రాణించాడు. ఓపెనర్ గా జట్టుకు మెరుపు ఆరంభాలను ఇస్తూ కీలక ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. నిలకడగా రాణిస్తుండడం జైశ్వాల్ కు కలిసొచ్చే అంశం.
అలాగే ఐపీఎల్ లో ఇప్పటి వరకూ కెప్టెన్సీ చేయకున్నా జూనియర్ స్థాయిలో మాత్రం సారథిగా అనుభవం ఉంది. అలాగే ఆన్ ది ఫీల్డ్ లో యాక్టివ్ గా ఉంటూ అందరితోనూ మంచి రిలేషన్ కొనసాగించడం కూడా ఈ యువ ఓపెనర్ గా అడ్వాంటేజ్ గా కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా ఫార్మాట్ తో సంబంధం లేకుండా ఒత్తిడిలోనూ చక్కని ఆటతీరు ప్రదర్శిస్తున్న జైశ్వాల్ ను రాయల్స్ ఫ్యూచర్ కెప్టెన్ గా చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.