England team : మీరు మీ చీటింగ్ వేషాలు

రాంచి టెస్టు సందర్భంగా ఇంగ్లండ్‌ ఆటగాళ్లు వ్యవహరించిన తీరుపై భారత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్‌ను గందరగోళంలో పడేయాలనే తలంపుతో ఇంతకు దిగజారుతారా అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో ఇంగ్లండ్‌ పేసర్‌ ఒలీ రాబిన్సన్‌ వేసిన ఆరో బంతిని తప్పుగా అంచనా వేసిన జైస్వాల్‌.

 

 

 

రాంచి టెస్టు సందర్భంగా ఇంగ్లండ్‌ ఆటగాళ్లు వ్యవహరించిన తీరుపై భారత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్‌ను గందరగోళంలో పడేయాలనే తలంపుతో ఇంతకు దిగజారుతారా అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో ఇంగ్లండ్‌ పేసర్‌ ఒలీ రాబిన్సన్‌ వేసిన ఆరో బంతిని తప్పుగా అంచనా వేసిన జైస్వాల్‌.. షాట్‌ ఆడటంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ చేతిలో పడ్డట్లుగా అనిపించింది.

దీంతో జైస్వాల్‌ అవుటైనట్లేనంటూ ఇంగ్లండ్‌ ఆటగాళ్లు పెద్ద ఎత్తున సెలబ్రేట్‌ చేసుకున్నారు. అయితే, రివ్యూలో అయితే, ఫలితాన్ని సరిగ్గా అంచనా వేసేందుకు థర్డ్‌ అంపైర్‌ ఒకటికి రెండుసార్లు బాల్‌ ట్రాకింగ్‌ చేశాడు. ఈ క్రమంలో బాల్‌ తొలుత నేలను తాకి.. ఆ తర్వాత వికెట్‌ కీపర్‌ చేతుల్లో పడినట్లు తేలింది. దీంతో జైస్వాల్‌ నాటౌట్‌గా తేలగా.. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ముఖ్యంగా కెప్టెన్‌ స్టోక్స్‌ తల పట్టుకుంటూ అసహనం వ్యక్తం చేశాడు.

ఈ నేపథ్యంలో ఇంగ్లిష్‌ ఆటగాళ్లు ఓవరాక్షన్‌ చేస్తూ అతిగా సెలబ్రేట్‌ చేసుకున్నారంటూ టీమిండియా ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. ఎలాగోలా ఒత్తిడి పెంచి జైస్వాల్‌ను అవుట్‌గా ప్రకటింపజేయడంలో భాగంగానే ఇలా చీటింగ్‌కు పాల్పడేందుకు కూడా వెనుకాడలేదని నెట్టింట ట్రోల్‌ చేస్తున్నారు.