Virat Kohli : టాప్ బౌలర్‌కే చుక్కలు చూపించావుగా…

గుజరాత్ (Gujarat), ఆర్‌సీబీ (RCB) మ్యాచ్‌లో విల్ జాక్స్ బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. అసలు ఎవ్వరూ ఊహించని విధంగా జాక్స్ సెంచరీ కొట్టాడు. కోహ్లీ కంటే తక్కువ స్కోరు ఉన్నప్పుడు మ్యాచ్ గెలుపు కోసం చేయాల్సిన పరుగులను చూస్తే అతని సెంచరీని ఎవ్వరూ ఊహించలేదు. అన్నింటికీ మించి వరల్డ్ టాప్ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌కు విల్ జాక్స్ చుక్కలు చూపించాడు.

ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లకు దడ పుట్టించే రషీద్ ఖాన్‌కు.. జాక్స్‌ ఏమాత్రం తలొగ్గలేదు. రషీద్ ఖాన్ (Rashid Khan) వేసిన 16వ ఓవర్లో జాక్స్ మొత్తం 29 పరుగులు చేశాడు. రెండు, మూడో బంతుల్లో జాక్స్ సిక్సర్లు, నాలుగో బంతికి బౌండరీ, ఐదు, ఆరు బంతుల్లో సిక్సర్లు బాది మ్యాచ్‌ను ఫినిష్ చేయడమే కాదు శతకాన్ని కూడా అందుకున్నాడు.

దీంతో మరో 4 ఓవర్లుండగానే ఆర్‌సిబి టార్గెట్ ఛేజ్ చేసింది. విల్ జాక్స్ విధ్వంసకర బ్యాటింగ్‌ను చూసి కోహ్లి (Virat Kohli) కూడా ఆశ్చర్యపోయాడు. అతన్ని చూస్తూ నోటిపై వేలు వేసుకున్న కోహ్లీ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాక్స్ కేవలం 41 బంతుల్లోనే 5 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 243.90 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 100 పరుగులు చేశాడు. అటు కోహ్లీ కూడా 44 బంతుల్లోనే 70 రన్స్ చేశాడు. హైదరాబాద్‌లో సన్‌రైజర్స్‌పై గెలిచిన ఆర్‌సిబికి ఇది వరుసగా రెండో విజయం.