Under-19 World Cup, India Players : సమరోత్సాహంతో యువభారత్… ఫైనల్లో కీలక ఆటగాళ్లు వీళ్లే

అండర్ 19 ప్రపంచకప్ అంటేనే భారత్ డామినేషన్ కు కేరాఫ్ అడ్రస్... ఈ మెగా టోర్నీ నుంచే గతంలో ఎంతోమంది వెలుగులోకి వచ్చారు. కోహ్లీ, యువరాజ్, కైఫ్, రైనా, పంత్... ఇలా కుర్రాళ్ల కెరీర్ ను మార్చేసిన అండర్ 19 ప్రపంచకప్ లో ఈ సారి ఎవరు సత్తా చాటబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం భారత యువ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ఒక్క ఓటమి లేకుండా ఫైనల్లోకి అడుగుపెట్టిన యువ జట్టులో పలువురు ప్లేయర్స్ టైటిల్ పోరులో కీలకం కానున్నారు.

అండర్ 19 ప్రపంచకప్ అంటేనే భారత్ డామినేషన్ కు కేరాఫ్ అడ్రస్… ఈ మెగా టోర్నీ నుంచే గతంలో ఎంతోమంది వెలుగులోకి వచ్చారు. కోహ్లీ, యువరాజ్, కైఫ్, రైనా, పంత్… ఇలా కుర్రాళ్ల కెరీర్ ను మార్చేసిన అండర్ 19 ప్రపంచకప్ లో ఈ సారి ఎవరు సత్తా చాటబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం భారత యువ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ఒక్క ఓటమి లేకుండా ఫైనల్లోకి అడుగుపెట్టిన యువ జట్టులో పలువురు ప్లేయర్స్ టైటిల్ పోరులో కీలకం కానున్నారు.

ముందుగా చెప్పుకోవాల్సింది కెప్టెన్ ఉదయ్ సహారన్ గురించే ఈ యువ సారథి బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీలోనూ అద్భుతాలు చేశాడు. టోర్నీలో ఉదయ్ 64.83 సగటుతో 389 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ ఎప్పుడు కష్టాల్లో కూరుకుపోయినా, ఉదయ్ మిడిల్ ఆర్డర్‌లో జట్టును ట్రబుల్ షూటర్‌గా హ్యాండిల్ చేయడం కనిపించింది. ఇప్పటి వరకు ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు సాధించాడు.

ఉదయ్ లాగే ముషీర్ ఖాన్ కూడా భారత మిడిల్ ఆర్డర్‌కు కీలకంగా ఉన్నాడు,. ముషీర్ ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు. 6 ఇన్నింగ్స్‌లలో 67.60 సగటుతో అతని 338 పరుగులు చేశాడు. దీనిలో రెండు శతకాలున్నాయి. అలాగే బ్యాటింగ్ సచిన్ దాస్ కూడా అదరగొడుతన్నాడు. ముఖ్యంగా సెమీస్ లో కెప్టెన్ తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు.సచిన్ 6 మ్యాచ్‌ల్లో 73.50 సగటుతో 294 పరుగులు చేశాడు

మరోవైపు బౌలింగ్ లో స్పిన్నర్ సౌమ్య పాండే కీలకం కానున్నాడు. ఈలెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ యాక్షన్ దాదాపు రవీంద్ర జడేజాను పోలి ఉంటుంది. సౌమ్య 6 ఇన్నింగ్స్ లలో 2.44 ఎకానమీతో 17 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. పేస్ విభాగంలో నమన్ తివారీ , రాజ్ లింబానీ కీలకం కానున్నారు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన తివారీ నిలకడగా రాణిస్తున్నాడు. బూమ్రా చిట్కాలతో సత్తా చాటుతున్న నమన్ 10 వికెట్లు తీశాడు. అలాగే రాజ్ లింబానీ కూడా జట్టులో ప్రధాన పేసర్ గా ఉన్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసిన రాజ్ లింబానీపై ఫైనల్లోనూ అంచనాలున్నాయి.