American : యూవీ రికార్డు బ్రేక్ చేసిన అమెరికా క్రికెటర్

టీ ట్వంటీ (T20) వరల్డ్ కప్ (World Cup) ప్రారంభ మ్యాచ్‌లోనే రికార్డులు బద్దలయ్యాయి. పరుగుల వరద పారిన తొలి మ్యాచ్‌లో అమెరికా కెనడాపై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.

టీ ట్వంటీ (T20) వరల్డ్ కప్ (World Cup) ప్రారంభ మ్యాచ్‌లోనే రికార్డులు బద్దలయ్యాయి. పరుగుల వరద పారిన తొలి మ్యాచ్‌లో అమెరికా కెనడాపై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో అమెరికా క్రికెటర్ ఆరోన్ జోన్స్ (Aaron Jones) అరుదైన రికార్డులు నెలకొల్పాడు. టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) చరిత్రలో ఛేదనలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్ ఓపెనర్‌గా నిలిచాడు. అలాగే అత్యధిక సిక్సర్లు బాదిన నాన్‌ ఓపెనర్‌గానూ చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా (South Africa) ప్లేయర్ రొసో పేరిట ఉండేది. అలాగే టీ ట్వంటీ వరల్డ్ కప్‌లో ఓవరాల్‌గా ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన రెండో ప్లేయర్‌గా ఆరోన్ జోన్స్ నిలిచాడు. పొట్టి ప్రపంచకప్‌లో క్రిస్ గేల్ ఇంగ్లండ్‌పై 11 సిక్సర్లు, దక్షిణాఫ్రికా‌పై 10 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో గేల్, జోన్స్ తర్వాతి స్థానాల్లో రోసో, యువరాజ్ సింగ్ (Yuvraj Singh), డేవిడ్ వార్నర్ (David Warner) ఉన్నారు.