Yuvraj Singh: టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచేది భారత్ కాదు: యువరాజ్ సింగ్

గంభీర్‌తో కలిసి ఓ షోలో పాల్గొన్న యువీ ఆశ్చర్యం కలిగించే విధంగా మాట్లాడాడు. అమెరికా, వెస్టిండీస్ కలిసి ఆతిథ్యమిచ్చే ఈ మెగా టోర్నీలో సౌతాఫ్రికా విజేతగా నిలుస్తుందని వ్యాఖ్యానించాడు. ఇటీవల వన్నే ప్రపంచకప్‌లో సఫారీలు బాగా ఆడారని యువీ చెప్పుకొచ్చాడు.

  • Written By:
  • Publish Date - December 27, 2023 / 04:33 PM IST

Yuvraj Singh; వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి నుంచి భారత్ అభిమానులు క్రమంగా తేరుకుంటున్నారు. అన్ని మ్యాచ్‌లూ అదరగొట్టిన రోహిత్ సేన టైటిల్ పోరులో చతికిలపడింది. ప్రస్తుతం సఫారీ పర్యటనలో ఉన్న టీమిండియా వచ్చే ఏడాది జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫేవరెట్ రేసులో ముందుంది. అయితే మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మాత్రం పొట్టి ప్రపంచకప్ గెలిచేది టీమిండియా కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

CM Revanth Reddy  : హరీష్‌, కేటీఆర్‌ ప్రజల రక్తపు కూడు తిన్నారు.

గంభీర్‌తో కలిసి ఓ షోలో పాల్గొన్న యువీ ఆశ్చర్యం కలిగించే విధంగా మాట్లాడాడు. అమెరికా, వెస్టిండీస్ కలిసి ఆతిథ్యమిచ్చే ఈ మెగా టోర్నీలో సౌతాఫ్రికా విజేతగా నిలుస్తుందని వ్యాఖ్యానించాడు. ఇటీవల వన్నే ప్రపంచకప్‌లో సఫారీలు బాగా ఆడారని యువీ చెప్పుకొచ్చాడు. సౌతాఫ్రికా తర్వాత పాకిస్తాన్ కూడా టైటిల్ రేసులో ఉందన్నాడు. అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఛాంపియన్‌గా ఉన్న ఆస్ట్రేలియా, భారత్‌తో పాటు ఇంగ్లాండ్‌లను యువీ పక్కన పెట్టడం అందరికీ షాక్ ఇచ్చింది. చోకర్స్‌గా పేరున్న సౌతాఫ్రికా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలుస్తుందన్న అతని కామెంట్స్‌పై భారత అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. 2022 టీ ట్వంటీ వరల్డ్ కప్‌లో సఫారీ టీమ్ సెమీస్ కూడా చేరలేకపోయింది. ఎప్పుడు మెగా టోర్నీ జరిగినా లీగ్ స్టేజ్ లేదా సెమీస్‌లో ఇంటిదారి పట్టే సౌతాఫ్రికా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిస్తే సంచలనంగానే చెప్పాలి.

అదే సమయంలో టీ ట్వంటీ క్రికెట్‌లో ఏ జట్టును తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. అలాంటిది యూవీ సౌతాఫ్రికాను విజేతగా అంచనా వేయడంపై క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ జట్టు కంటే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మెరుగ్గా ఉన్నాయంటున్నారు. ఇదే షోలో గంభీర్ ఈ మూడు జట్లనే టైటిల్ ఫేవరెట్స్‌గా చెబితే.. దానికి చిన్నగా యువీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.