డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి ఇటీవల కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోనీ, కపిల్ దేవ్ ను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ధోనీ తన కొడుకు కెరీర్ నాశనం చేశాడని, అతన్ని క్షమించనంటూ యోగరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. అలాగే కపిల్ దేవ్ కంటే కూడా తన కుమారుడు యువీనే గొప్పవాడంటూ ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరగ్ మారాయి. తండ్రి యోగరాజ్ సింగ్ మానసిక స్థితి సరిగా లేదంటూ గతంలో యువీ చెప్పిన మాటలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్.. తన తండ్రి ఓ పిచ్చోడని చెప్పుకొచ్చాడు. తన తండ్రి మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, ఆ విషయాన్ని అతను అంగీకరించడం లేదని చెప్పాడు. ఆయన తన సమస్యను గుర్తించాల్సిన అవసరం చాలా ఉందంటూ గతంలో యువీ చెప్పిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.
ధోనీ, కపిల్ దేవ్‌పై యోగ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్లు యువీ కామెంట్స్ ను వైరల్ చేస్తున్నారు. యోగ్ రాజ్ పిచ్చోడని, అతని కొడుకే చెబుతున్న విషయాన్ని అందరూ గుర్తించాలంటూ పోస్టులు పెడుతున్నారు. ధోనీ గురించి యువీ తండ్రి చేసిన వ్యాఖ్యలను అభిమానులు పట్టించుకోవద్దని కామెంట్ చేస్తున్నారు. కేవలం ధోనీ గురించే కాదు కపిల్ దేవ్ పైనా యోగరాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కపిల్ తన కొడుకు కంటే గొప్ప ఆటగాడు కాదన్నాడు. కపిల్ దేవ్ కారణంగానే తాను జట్టులో చోటు కోల్పోయానని యోగ్ రాజ్ ఆరోపించాడు. 1980-81లో యోగ్ రాజ్ భారత్ తరఫున ఒక టెస్ట్, 6 వన్డేలు ఆడాడు.