Telangana Ministers : తెలంగాణ రాష్ట్ర మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవరెవరికి ఏ శాఖనో తెలుసా..?

నేడు అధికారికంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రిత్వ శాఖలను కేటాయించారు. మంత్రులకు శాఖల కేటాయింపు విషయంపై శుక్రవారం ఢిల్లీ వెళ్లిన సీఎం.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్, గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సూదీర్ఘ చర్చలు జరిపిన.. అనంతరం మంత్రుల శాఖలపై శనివారం ఓ ప్రకటన చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి భారీ మెజారిటీతో విజయం సాధించి.. తెలంగాణ రెండో ముఖ్య మంత్రిగా ఎనుమల రేవంత్ రెడ్డి డిసెంబర్ 3 ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.. అదే రోజు మంత్రుల చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు తాజాగ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉదయం వారి వారి శాఖలను కేటాయించింది. కాగా ప్రమాణ స్వీకారం అయిన మూడు రోజుల తర్వాత మంత్రులకు శాఖలను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం.

Protem Speaker, Akbaruddin : తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్..

నేడు అధికారికంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రిత్వ శాఖలను కేటాయించారు. మంత్రులకు శాఖల కేటాయింపు విషయంపై శుక్రవారం ఢిల్లీ వెళ్లిన సీఎం.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్, గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సూదీర్ఘ చర్చలు జరిపిన.. అనంతరం మంత్రుల శాఖలపై శనివారం ఓ ప్రకటన చేశారు.

మంత్రులు – శాఖలు..

  • భట్టి విక్రమార్క – ఆర్థిక, ఇంధన శాఖ
  • తుమ్మల నాగేశ్వరరావు – వ్యవసాయం, చేనేత
  • జూపల్లి కృష్ణారావు – ఎక్సైజ్‌, పర్యాటకం
  • కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి – ఆర్‌ అండ్‌ బీ, సినిమాటోగ్రఫీ
  • దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు – ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహరాలు
  • పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి – రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ
  • పొన్నం ప్రభాకర్‌ – రవాణా, బీసీ సంక్షేమం
  • సీతక్క – పంచాయతీ రాజ్‌, మహిళ, శిశు సంక్షేమం
  • కొండాసురేఖ – అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ
  • ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి – నీటి పారుదల, పౌరసరఫరాలు
  • దామోదర రాజనర్సింహ – వైద్య, ఆరోగ్య శాఖ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ