Telangana Assembly Elections: ఎన్నికల షెడ్యూల్ విడుదలతో తెలంగాణ కంప్లీట్‌గా ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లిపోయింది. మంత్రులు జిల్లాలకు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు పరిమితయ్యారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఇప్పుడే చెప్పలేం. అన్ని పార్టీలకు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్‌లు చాలా ముఖ్యం. ఇలాంటి నేపథ్యంలో ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం అత్యంత కీలకంగా మారింది.
ప్రత్యేకించి ఈ అసెంబ్లీ స్థానానికి ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది. చాలా ఏళ్ల నుంచి ఆందోల్‌లో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడో రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తోంది. ఈ పరంపర ఇప్పుడు మొదలైంది కాదు. 1984 నుంచి దాదాపుగా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతోంది. 2014లో, 2018లో కూడా ఇదే రిపీట్ అయ్యింది. గడిచిన రెండు ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు. ఆ రెండు సార్లు కూడా రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీనే అధికారంలో ఉంది. దీంతో ఈ సెంటిమెంట్ ఇప్పుడు ఆందోల్‌ను వెంటాడుతోంది. ఈ సారి ఎన్నికల్లో ఇక్కడ ఏ పార్టీ వ్యక్తి గెలవబోతున్నాడు అనే ఆసక్తి అందరిలో ఉంది. అటు రాజకీయ పార్టీలు కూడా ఆందోల్ స్థానాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ ఈ స్థానాన్ని ఇప్పటికే క్రాంతి కిరణ్‌కు ఖరారు చేసింది. ఇక కాంగ్రెస్ నుంచి ఇక్కడ సీనియర్ నేత దామోదర రాజనరసింహ ఉన్నారు. బీజేపీ నుంచి బాబు మోహన్ ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే ఆసక్తి నెలకొంది.
ఈసారి కూడా సెంటిమెంట్ రిపీట్ అవుతుందా.. లేక ఈ ప్రచారానికి బ్రేక్ పడుతుందా అనేది సస్పెన్స్‌గా మారింది. ఎందుకంటే సెంటిమెంట్లను నమ్మేవాళ్లు సొసైటీలో చాలా మంది ఉంటారు. ఏ పని చేయాలన్నా ముహుర్తాలు చూసుకునేవాళ్లకు కొదువే లేదు. కొన్నిసార్లు ఇలాంటి సెంటిమెంట్లు సిల్లీగా అనిపించినా.. కాస్త డీప్‌గా అబ్జర్వ్ చేస్తే వాటిలో కూడా లాజిక్ ఉంటుంది. ఆందోల్ నియోజకవర్గం కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలోనే ఉంది. చూడాలి మరి ఈసారి ఎలాంటి రిజల్ట్ వస్తుందో.