CM Revanth : సీఎం రేవంత్‌ మరో సంచలన నిర్ణయం.. వాళ్లందరి పోస్ట్‌లు ఔట్‌..

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి వరుస సంచలనాలకు తెర లేపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చే నిర్ణయాలు తీసుకుంటూ వాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఇష్టారీతిన పని చేసిన అధికారులు, నాయకులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఈ కారణంగానే రేవంత్‌ సీఎం అయిన వెంటనే కొందరు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇంకా చాలా మందిని తీసేసే పనిలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారులన తొలగించాలంటూ చెప్పారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి వరుస సంచలనాలకు తెర లేపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చే నిర్ణయాలు తీసుకుంటూ వాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఇష్టారీతిన పని చేసిన అధికారులు, నాయకులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఈ కారణంగానే రేవంత్‌ సీఎం అయిన వెంటనే కొందరు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇంకా చాలా మందిని తీసేసే పనిలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారులన తొలగించాలంటూ చెప్పారు. దీంతో సీఎస్‌ శాంతి కుమారి ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు మరికొందరి నియామకాలు కూడా రద్దు చేయబోతున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పోరేషన్‌ చైర్మన్ల నియామకాలు రద్దు చేయాలంటూ ఆదేశించారు. దీంతో మొత్తం 54 కార్పోరేషన్ల చైర్మన్లు ఇప్పుడు రాజీనామా చేయక తప్పదు. ఇప్పటికే కొందరు రాజీనామా చేయగా.. ఇప్పుడు అందరి పోస్ట్‌లు రద్దయ్యాయి. వీళ్లంతా బీఆర్‌ఎస్‌ హయాంలో చైర్మన్లుగా పదవుల్లోకి వచ్చారు. ఇప్పుడు వీళ్ల నియామకాల రద్దుతో.. వీళ్ల స్థానంలో కొత్త చైర్మన్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం నియమిస్తుంది. రేవంత్‌ ఆధ్వర్యంలో ఈ ప్రక్షాళన ఇక్కడితో ఆగేలా కనిపించడంలేదు. ఐఏఎస్‌ అధికారుల్లో కూడా చాలా మంది ట్రాన్స్‌ఫర్‌ అయ్యే ఛాన్స్‌ ఉన్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి సీఎం రేవంత్‌ ఈ స్వీపింగ్‌ ఎప్పుడు ఆపేస్తారో.