Telangana Elections : 5 రోజుల్లో పోలింగ్‌.. KCRకు షాకిచ్చిన ఈసీ..

తెలంగాణలో పోలింగ్‌ దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అపోజిట్‌ పార్టీలను ఓడించేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ప్రత్యర్థులను బుక్‌ చేయించేందుకు ఉన్న అన్ని అవకాశాలను రాజకీయ నాయకలు సద్వినియోగం చేసుకుంటున్నారు.

తెలంగాణలో పోలింగ్‌ దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అపోజిట్‌ పార్టీలను ఓడించేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ప్రత్యర్థులను బుక్‌ చేయించేందుకు ఉన్న అన్ని అవకాశాలను రాజకీయ నాయకలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ సీఎం కేసీఆర్‌ మీద ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మీద విచారణ చేపట్టిన ఎలక్షన్‌ కమిషన్‌ కేసీఆర్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. రీసెంట్‌గా బీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి మీద ప్రచారంలో ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ దాడిలో ప్రభాకర్‌ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. పొజిషన్‌ క్రిటికల్‌గా ఉండటంతో డాక్టర్లు ఆపరేషన్‌ కూడా నిర్వహించారు. మొత్తానికి ప్రభాకర్‌ రెడ్డి ప్రణాపాయం నుంచి బటయపడ్డారు.

BRS-BJP: రహస్య బంధం.. ఆ 20 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందా..? బీజేపీతో రహస్యబంధం ఏంటో..!

ఇదే విషయంపై ఓ ప్రచార సభలో కేసీఆర్‌ ప్రత్యర్థుల మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ వాళ్లు రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దాడులు చేయిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. దాడి చేయాలంటే మేము చేయలేమా.. మొండిదో మంచిదో మాకు కత్తులు దొరకవా అంటూ కామెంట్లు చేశారు. ఇదే వ్యాఖ్యలపై NSUI అధ్యక్షుడు వెంటక ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మీద ఆరోపణలు చేయడమే కాకుండా.. కార్యకర్తలను రెచ్చగొట్టేలా ఎన్నికల ప్రచారం నిర్వహించారు కంప్లైట్‌ ఇచ్చారు. దీనివై విచారణ చేపట్టిన ఎన్నికల కమిషన్‌ కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల నియమావలిని ఉల్లంఘించినందుకు కేసీఆర్‌కు నోటీసులు జారీ చేస్తున్నట్టు వివరించింది. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ హెచ్చిరించింది. మిగిలిన మీటింగ్స్‌లో ఇలాంటి కామెంట్స్‌ చేయొద్దంటూ కేసీఆర్‌కు సూచించింది. ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో.. కేసీఆర్‌కు ఈసీ నుంచి నోటీసులు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.