2024లో ఎంపీగా బర్రెలక్క పోటీ.. ఆమెకు ఎన్ని ఓట్లు అంటే..!

కర్నె శిరీష.. అలియాస్ బర్రెలక్క .. తెలంగాణ ఎన్నికల్లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారింది. కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె గెలవాలని చాలామంది కోరుకున్నారు. జేడీ లక్ష్మీనారాయణ లాంటి ప్రముఖులు బర్రెలక్కకు ఆర్థిక సాయం చేశారు. ఈ ఎన్నికల్లో ఆమెకు 5 వేల 754 ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో ఓడిపోయి.. నాలుగో స్థానంలో నిలిచినా.. మనసులు గెలుచుకున్నావంటూ నెటిజెన్లు ప్రశంసిస్తున్నారు. నిరుద్యోగుల వాయిస్ వినిపించడానికి 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానంటోంది బర్రెలక్క. 

డబ్బే ప్రధానంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క లాంటి సామాన్యులు గెలవడం కష్టమే. కనీసం రోజు గడవటం కూడా కష్టమైన బర్రెలక్క.. ఈ ఎన్నికల్లో ఎన్నో ఇబ్బందులు పడింది. తన తమ్ముడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి కూడా చేశారు. కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకొని.. గన్ మెన్ ప్రొటెక్షన్ తో ప్రచారం చేసుకుంది బర్రెలక్క. ఆమె పోటీ చేసింది మామూలు వ్యక్తులతో కాదు.. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళతో పోటీ పడింది.

నిజానికి బర్రెలక్కకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ లక్షల్లోనే ఉన్నారు. యూట్యూబ్ లో ఒకటిన్నర లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో దాదాపు 6 లక్షల మంది ఫాలోవర్లు, ఫేస్ బుక్ లో మరో లక్షమంది అనుసరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆ ఫాలోయింగ్ కలిసొస్తుందని ఆశలు పెట్టుకుంది బర్రెలక్క. కానీ అది సాధ్యపడలేదు. సోషల్ మీడియాలో లైకులు కొట్టేవారు.. కామెంట్స్ చేసేవారు.. షేర్ చేసేవారు ఓట్లు వేయరు. కానీ నిరుద్యోగ వాణిని వినిపించడానికి ఆమె ఎన్నుకున్న మార్గం సరైనది. తనకు రాజకీయ, ఇతర ప్రముఖులు.. తన ఫాలోవర్స్ అందించిన ఉత్సాహంతో నెక్ట్స్ 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తానంటున్నారు. ఒక్క రూపాయి కూడా పంచకుండా నిజాయతీగా ఓట్లేసిన జనానికి కృతజ్ఞతలు తెలిపారు బర్రెలక్క. ప్రజా సమస్యలపై పోరాటానికే పార్లమంట్ కు కూడా పోటీ చేస్తా అంటోంది. బర్రెలక్క స్ఫూర్తికి ప్రతి ఒక్కరూ కంగ్రాట్స్ చెబుతున్నారు.