కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ ప్రకటనకు ముందు, తర్వాత.. ఎల్బీనగ (LB Nagar) నియోజకవర్గం (constituency) గురించి జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. మధుయాష్కీ (Madhuyashki) కి టికెట్ ఇవ్వొద్దంటూ.. సొంత పార్టీలోనే తిరుగుబాటు జరిగింది. లోకల్ వర్సెస్ నాన్ లోకల్ యుద్ధం తెరమీదకు వచ్చింది. మధు యాష్కీ లోకల్ కాదు అని ఎల్బీనగర్ కాంగ్రెస్ (Congress) లో కొందరు నేతలు ఆరోపణలు గుప్పిస్తే.. తాను పుట్టింది ఆ ప్రాంతంలోనే.. నేను లోకల్ అని మధుయాష్కీ ఆన్సర్ ఇస్తూ వచ్చారు. ఇలా సొంతింట్లోనే కుంపటి రేగడంతో.. కాంగ్రెస్‌లో కనిపించిన అలజడి అంతా ఇంతా కాకదు. ఐతే ఎన్ని తిరుగుబాట్లు కనిపించినా.. మధుయాష్కీకే టికెట్ కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. 2018లో కాంగ్రెస్ గెలిచిన నియోజకవర్గాల్లో ఎల్బీనగర్ ఒకటి. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన సుధీర్ రెడ్డి.. ఆ తర్వాత కారెక్కారు.
Khammam, Political : కాంగ్రెస్‌కు దెబ్బేసిన కామ్రేడ్లు.. ఆ రెండు జిల్లాల్లో పోటీ.. ?
ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు (Congress vote bank) ఎక్కువగా ఉండటంతో.. ఈ టికెట్ కోసం భారీగా పోటీ కనిపించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో గెలిచిన తర్వాత బీఆర్ఎస్ ( BRS )లోకి వెళ్లడంతో.. అప్పటి నుంచి లోకల్‌లో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఐతే జక్కిడి ప్రభాకర్ రెడ్డి (Jakkidi Prabhakar Reddy) మాత్రం మొదటి నుంచి కాంగ్రెస్‌ను నమ్ముకొని ఉన్నారు. తనకే టికెట్ వస్తుందనే ధీమాతో నియోజకవర్గం మొత్తం పోస్టర్లు కొట్టించారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) టైమ్‌లో భారీగానే ఖర్చు పెట్టారు. తనకు టికెట్ పక్కా అని జక్కిడి ఫిక్స్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో అలిగిన రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరారు. తనకు కాకపోయినా తన భార్యకు టికెట్ ఇవ్వాలని కోరారు. బీసీ కోటాలో తప్పకుండా టికెట్ వస్తుందని ఆశపడ్డారు. చివరకు కాంగ్రెస్ అధిష్టానం మధు యాష్కీ గౌడ్‌కు టికెట్ ఇచ్చింది.
Bandi Sanjay, padayatra : మరో పాదయాత్రకు సిద్ధమైన బండి..ఈసారి అంతకుమించి
ఇది స్థానిక కాంగ్రెస్ నాయకులకు, కేడర్‌కు మింగుడు పడటం లేదు. స్థానికేతరుడైన మధు యాష్టీకి టికెట్ ఇవ్వడంపై ఇప్పటికీ గుర్రుగానే ఉన్నారు. మరోవైపు రామ్మోహన్ గౌడ్ తిరిగి బీఆర్ఎస్‌లో చేరారు. మధుయాష్కి స్థానికేతరుడనే కారణంతో లోకల్ కాంగ్రెస్ నాయకులు పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాను హయత్‌నగర్‌లోనే పుట్టానని మధు యాష్కి చెప్పుకుంటున్నా.. స్థానికులు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికే మధు యాష్కికి టికెట్ కేటాయించినా.. ఇప్పటి వరకు నియోజకవర్గంలో తిరిగింది లేదు. నిజానికి మధుయాష్కి శుక్రవారమే నామినేషన్ వేయాలని డిసైడ్ అయ్యారు. ఐతే స్థానిక నాయకులు సహకరించకపోవడంతో వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. టికెట్ వచ్చేంత వరకు ఒక యుద్ధం.. టికెట్ వచ్చాక మరో యుద్ధం అన్నట్లు తయారయింది మదు యాష్కీ పరిస్థితి. కలిసి నడుద్దామంటే కలిసేవాళ్లు లేరు. కలిసి ఉన్న వాళ్లతో కలిసి నడిచే పరిస్థితి లేదు. దీంతో నీ కష్టం పగోడికి కూడా రావొద్దయ్యా మధు యాష్కీ అంటూ.. పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో.