BJP: ఎన్నికల వేళ బీఆర్ఎస్ దాదాపు అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ 55 స్థానాల్లో అభ్యర్థులను అనౌన్స్ చేసింది. ఐతే బీజేపీ మాత్రం వెనకే ఉండిపోయింది. లిస్ట్‌కు సంబంధించి ఎట్టకేలకు కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో జాబితా బయటపెట్టే అవకాశాలు ఉన్నాయ్. ఢిల్లీలో పార్టీ పెద్దలకు ఓ లిస్ట్ పెట్టగా.. చిన్న చిన్న మార్పులు చేసి వాళ్లు జాబితా చేసినట్లు తెలుస్తోంది. ఆ జాబితా చూస్తే.. కరీంనగర్ నుంచి బండి సంజయ్, వేములవాడ నుంచి చెన్నమనేని వికాస్ రావు, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ బరిలో దిగబోతున్నారు.
గద్వాల్‌లో డీకే అరుణ, కరీంనగర్‌లో బండి సంజయ్, అంబర్‌పేట నుంచి కిషన్ రెడ్డి, ముషీరాబాద్ నుంచి బండారు విజయలక్ష్మి, బోథ్ నుంచి సోయం బాపూరావు, దుబ్బాక నుంచి రఘునందన్ రావు, హుజురాబాద్‌లో ఈటల రాజేందర్, మహబూబ్‌నగర్ నుంచి జితేందర్ రెడ్డి, కల్వకుర్తిలో తల్లోజు ఆచారి, నిర్మల్ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముథోల్‌లో రామారావు పటేల్, ఖానాపూర్ నుంచి రాథోడ్ రమేష్, ఖైరతాబాద్ నుంచి చింతల రామచంద్రారెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి రామచంద్ర రావు, ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పోటీ చేయబోతున్నారు. ఇక తాండూరు నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి, మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నుంచి కూన శ్రీశైలం గౌడ్, ధర్మపురి నుంచి వివేక్ వెంకటస్వామి, ఇబ్రహీంపట్నం నుంచి బూర నర్సయ్య గౌడ్, పఠాన్ చెరువు నుంచి నందీశ్వర్ గౌడ్, భువనగిరి నుంచి గూడూరు నారాయణ రెడ్డి, గోషామహల్ నుంచి విక్రమ్ గౌడ్, మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి, భూపాలపల్లి నుంచి కీర్తి రెడ్డి, సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పాల్వాయి హరీష్, రాజేంద్ర నగర్ నుంచి తోకల శ్రీనివాస్ రెడ్డి, మహేశ్వరం నుంచి అందెల శ్రీరాములు యాదవ్, సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
నారాయణపేట నుంచి రతంగ్ పాండు రెడ్డి, అందోల్ నుంచి బాబు మోహన్, మానకొండూర్ నుంచి ఆరేపల్లి మోహన్, సూర్యాపేటలో సంకినేని వెంకటేశ్వర రావు.. బీజేపీ తరఫున బరిలో నిలవబోతున్నారు.