Telangana Assembly Elections: ఎన్నికల ప్రచారానికి దూరంగా కవిత.. వద్దన్నారా.. ఆమే దూరంగా ఉన్నారా..?

ఎంపీగా ఓడిన తర్వాత నుంచి కవిత గ్రాఫ్ పడిపోయిందనే చర్చ కూడా నడుస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా.. తెలంగాణలో జరిగిన గత రెండు ఎన్నికల్లో కవిత కీలక పాత్ర పోషించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ.. బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.

  • Written By:
  • Publish Date - October 20, 2023 / 05:18 PM IST

Telangana Assembly Elections: కల్వకుంట్ల ఫ్యామిలీ సభ్యులంటేనే మాటల మాంత్రికులు. ఈ విషయంలో కేటీఆర్‌, కవిత.. కేసీఆర్‌ వారసత్వాన్ని పక్కాగా అందుకున్నారు. కేటీఆర్, కవిత.. ఇద్దరు కూడా మాటలతో మ్యాజిక్ చేయగలరు. అవతలి వాళ్ల మనసు ఈజీగా గెలుచుకోగలరు. కవిత, కేటీఆర్, కేసీఆర్ ముగ్గురూ మాటల మరాఠీలే. ఎవరూ ఎవరికీ తక్కువ కాదు. తెలంగాణ ఉద్యమంలోనూ కవిత యాక్టివ్ రోల్ ప్లే చేశారు. బతుకమ్మ పండగతో ఉద్యమంలోకి మహిళలను తీసుకొచ్చి.. రాష్ట్రం రావడానికి ఒక కారణం అయ్యారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

ఐతే కట్‌ చేస్తే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి గ్రాండ్ విక్టరీ కొట్టిన కవిత.. గత ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కవితకు కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా.. మునుపటి జోష్ కవితలో కనిపించడం లేదు అనే అభిప్రాయాలు ఉన్నాయ్. ఎంపీగా ఓడిన తర్వాత నుంచి కవిత గ్రాఫ్ పడిపోయిందనే చర్చ కూడా నడుస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా.. తెలంగాణలో జరిగిన గత రెండు ఎన్నికల్లో కవిత కీలక పాత్ర పోషించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ.. బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. మహిళా ఓటర్లను అట్రాక్ట్ చేయడమే లక్ష్యంగా కవిత ప్రసంగాలు వినిపించాయ్ ఆ రెండుసార్లు కూడా! కవిత.. తమ నియోజకవర్గానికి ప్రచారానికి రావాలంటూ చాలామంది నేతలు క్యూ కట్టే వారు. కానీ, ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయింది. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో కవిత కనిపించడం లేదు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీష్ మాత్రమే ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో కవిత ఎక్కడ.. ఏమయ్యారు అనే చర్చ జోరుగా సాగుతోంది.

కవితే దూరంగా ఉన్నారా.. లేక దూరం పెట్టారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఈ పరిణామాలన్నింటికీ ఢిల్లీ లిక్కర్‌ స్కామే కారణం అనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. కవిత ఈడీ విచారణకు హాజరుకావడం.. చార్జిషీట్‌లో ఆమె పేరు ఉండడం.. రకరకాల పరిణామాలతో కవిత ఇమేజ్ డ్యామేజీ అయింది. స్కామ్‌లో నిజానిజాలు పక్కన పెడితే.. ఒక మహిళగా లిక్కర్ స్కాంలో చిక్కుకోవడం.. పార్టీకి తలనొప్పిగా మారింది. దీంతో కవితను ఈసారి ఎన్నికల ప్రచారానికి కాస్త దూరంగా పెట్టడమే బెటర్ అని గులాబీ పార్టీ అధిష్టానం భావించిందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. దీనికి సంబంధించి ఓ వర్గం మీడియాలో కూడా ఇదే ప్రచారం సాగుతోంది. మరి నిజం ఏంటి అన్నది మాత్రం కాలమే సమాధానం చెప్పాలి.