Amberpet Shankar: అంబర్‌పేట్‌ శంకర్‌ను బీఆర్‌ఎస్‌ ఆయుధంలా వాడబోతోందా..?

శంకర్‌ ముందిరాజ్‌తో బీఆర్‌ఎస్‌ పార్టీ కీలక అడుగులు వేయించబోతున్నట్టు ఇంటర్నల్‌ టాక్‌ నడుస్తోంది. తెలంగాణలో ముదిరాజ్‌ కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇందులో ఎలాంటి డౌట్‌ లేదు. శంకర్‌ స్వయంగా ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి.

  • Written By:
  • Publish Date - October 20, 2023 / 07:17 PM IST

Amberpet Shankar: తెలంగాణలో హ్యాట్రిక్‌ కొట్టడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. గెలుపు కోసం సహాయపడతారు అనిపించిన ప్రతీ ఒక్కరినీ పార్టీలో చేర్చుకుంటూ ముందుకు వెళుతోంది. కీలక నేతలను కలుపుకొనిపోతూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే అంబర్‌పేట్‌ శంకర్‌గా పేరు పొందిన శంకర్‌ ముదిరాజ్‌ను పార్టీలోకి ఆహ్వానించింది బీఆర్‌ఎస్‌. మంత్రి హరీష్‌ రావు స్వయంగా శంకర్‌కు కండువా కప్పి పార్టీలో జాయిన్‌ చేసుకున్నారు. అయితే శంకర్‌ ముందిరాజ్‌తో బీఆర్‌ఎస్‌ పార్టీ కీలక అడుగులు వేయించబోతున్నట్టు ఇంటర్నల్‌ టాక్‌ నడుస్తోంది.

తెలంగాణలో ముదిరాజ్‌ కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇందులో ఎలాంటి డౌట్‌ లేదు. శంకర్‌ స్వయంగా ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఆయనకు యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. కేవలం అంబర్‌పేట్‌, హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా శంకర్‌ను అభిమానించేవాళ్లు, అనుసరించేవాళ్లు చాలా మంది ఉన్నారు. దీంతో శంకర్‌ ఇమేజ్‌ను క్యాచ్‌ చేసి ముదిరాజ్‌ కమ్యూనిటీని ఓట్‌ బ్యాంక్‌గా మార్చుకునే ప్రయత్నం జరుగుతోందని చర్చ జరుగుతోంది. చాలా కాలం నుంచి ముదిరాజ్‌ కమ్యూనిటీకి చెందిన నేతలు బీఆర్‌ఎస్‌ మీద గుర్రుగా ఉన్నారు. ఈటెల రాజేందర్‌ పార్టీ నుంచి వెళ్లిపోయిన తరువాత ముదిరాజ్‌ కమ్యూనిటీ నుంచి బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత ఎక్కువైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రీసెంట్‌గా నిరసనలు కూడా చేశారు. పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ సభ పెట్టి సక్సెస్‌ చేశారు. దీంతో ముదిరాజుల నుంచి ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునే పనిలో పడింది బీఆర్‌ఎస్‌ హైకమాండ్‌.

శంకర్‌కు ఉన్న ఇమేజ్‌, క్యాస్ట్‌.. ఈ రెండిటినీ బేస్‌ చేసుకుని ముదిరాజులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఆయనతో ప్రచారం చేయించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే మదిరాజ్‌ల నుంచి ఉన్న వ్యతిరేకతను బీఆర్‌ఎస్‌ కాస్త తగ్గించుకునే ఛాన్స్‌ ఉంటుంది. ఇక శంకర్‌కు నామినేటెడ్‌ పోస్ట్‌ ఇచ్చే ఆలోచనలో కూడా బీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే మరోసారి ముదిరాజుల్లో బీఆర్‌ఎస్‌ ఇమేజ్‌ పెరగడం గ్యారెంటీ అంటున్నారు విశ్లేషకులు. త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అంబర్‌పేట్‌ శంకర్‌ను బీఆర్‌ఎస్‌ ఎలా వాడుతుందో చూడాలి.