Mallareddy : మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు.. 47 ఎకరాల భూకబ్జా..!

తెలంగాణ మాజీ కార్మిక మంత్రి సీహెచ్ మల్లారెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్.సి, ఎస్టీ అట్రాసిటీ కింద మాల్లరెడ్డిపై కేసు నమోదు చేశారు. గిరిజనుల భూములను మల్లారెడ్డి కబ్జా చేశారని ఫిర్యాదు అందడంతో ఆయనపై కేసు నమోదయింది. మొత్తం 47 ఎకరాలను కబ్జా చేశారని కొందరు ఫిర్యాదు చేయడంతో శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గిరిజనుల భూములను.. కబ్జా చేసి రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్లు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గంగా రామ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిష్టర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారానికి సహకరించిన శామీర్ పేట్ తహశీల్దార్ పై సైతం కేసు నమోదు అయినట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తం నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 420 కింద కూడా కేసు నమోదు చేశారు. గతంలో కూడా మల్లారెడ్డిపై పలు రకాల కేసులు నమోదయ్యాయి. భూ కబ్జాకు సంబంధించి బాధితురాలు ‎ఫిబ్రవరిలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు.. కాగా మల్లారెడ్డికి చెందిన రెడు ఆస్పత్రుల మధ్యలో ఉన్న కాలీ భూమిని కబ్జా చేసేందుకు యత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇతరుల భూమిని ఆక్రమించడమే కాకుండా వాటికి నకిలీ పత్రాలు సృష్టించి మంత్రి, తమ ల్యాండర్ లోకి తమనే అడుగు పెట్టనివ్వ కుండా అడ్డుపడుతున్నారని ఆరోపణలు చేశారు.

2020 లో కూడా కుత్బుల్లాపూర్ మండలం సూరారం గ్రామంలో 2 ఎకరాల 13 కుంటల భూమిలో కొంత భాగాన్ని కబ్జా చేశారంటూ శ్యామల అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన లాయర్ మల్లారెడ్డి కి అమ్ముడు పోయి నకిలీ డాక్యుమెంట్లను సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను బెదిరిస్తున్నారని శ్యామల పోలీసులకు తెలిపారు. ఇరవై గుంటల భూమిని ఆక్రమించి మల్లారెడ్డి కాంపౌండ్ వాల్ నిర్మించుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మరోసారి మాజీ మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.