Telangana Congress : ఆ మూడు స్థానాల్లో అభ్యర్థుల మార్పు.. కాంగ్రెస్‌ థర్డ్‌ లిస్ట్‌లో సంచలనాలు..

వనపర్తి (Wanaparthi), చేవెళ్ల (Chevella) , బోథ్‌ నియోజకవర్గాల అభ్యర్థులపై సమీక్షించాలని.. వారికి బీ ఫామ్‌లు ఇవ్వొద్దని అధిష్ఠానం ఆదేశించినట్టు సమాచారం. ఇక అటు ఫైనల్‌ లిస్ట్ అనౌన్స్‌ చేసేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధం అవుతోంది. 119 స్థానాలకు కాంగ్రెస్ ఇప్పటివరకు 100స్థానాలకు అభ్యర్దులను ఖరారు చేసింది. ప్రకటించాల్సిన 19స్థానాలపై కసరత్తు దాదాపు పూర్తయింది. వామపక్షాలతో పొత్తు.. కొందరు ముఖ్య నేతలు పార్టీలో చేరిక వంటి అంశాలతో.. అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఫైనల్‌ లిస్ట్‌ ప్రకటనకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ (Telangana) ఇచ్చిన పార్టీగా, తెచ్చిన పార్టీగా క్రెడిట్ సాధించడంలో కాంగ్రెస్ (Congress) ఘోరంగా ఫెయిల్ అయింది. వరుసగా రెండు సార్లు అధికారానికి దూరంగా ఉంది. ఐతే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారం దక్కించుకోవాలని హస్తం పార్టీ.. పావులు కదుపుతోంది. ఎవరో ఏదో అనుకుంటారు.. అలక పాన్పు ఎక్కుతారు అనే లెక్కలు లేకుండా.. గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని హస్తం పార్టీ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. కొన్ని స్థానాలను వదిలేస్తే.. మొదటి రెండు జాబితాలను పరిశీలిస్తే అదే అర్థం అవుతోంది కూడా ! కర్ణాటక (Karnataka) విజయం ఇచ్చి బూస్టింగ్‌తో తెలంగాణలోనూ దూసుకుపోవాలని ఫిక్స్ అయిన కాంగ్రెస్‌.. కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల జాబితాలోనూ మార్పులు చేసేందుకు రెడీ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. పార్టీ ఇప్పటికే ప్రకటించిన అభ్యర్దుల్లో ముగ్గురికి బీ ఫామ్‌లు పెండింగ్‌లో పెట్టాలని రాష్ట్ర నేతలకు.. పార్టీ హైకమాండ్ సూచించినట్లు తెలుస్తోంది. ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్దుల మార్పు పైన చర్చ జరిగినట్లు టాక్.

CM KCR: సీఎం కేసీఆర్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్.. తప్పిన పెను ప్రమాదం..

వనపర్తి (Wanaparthi), చేవెళ్ల (Chevella) , బోథ్‌ నియోజకవర్గాల అభ్యర్థులపై సమీక్షించాలని.. వారికి బీ ఫామ్‌లు ఇవ్వొద్దని అధిష్ఠానం ఆదేశించినట్టు సమాచారం. ఇక అటు ఫైనల్‌ లిస్ట్ అనౌన్స్‌ చేసేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధం అవుతోంది. 119 స్థానాలకు కాంగ్రెస్ ఇప్పటివరకు 100స్థానాలకు అభ్యర్దులను ఖరారు చేసింది. ప్రకటించాల్సిన 19స్థానాలపై కసరత్తు దాదాపు పూర్తయింది. వామపక్షాలతో పొత్తు.. కొందరు ముఖ్య నేతలు పార్టీలో చేరిక వంటి అంశాలతో.. అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఫైనల్‌ లిస్ట్‌ ప్రకటనకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక అటు అభ్యర్థుల మార్పు విషయంలో ముఖ్యంగా మూడు నియోజకవర్గాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. వనపర్తిలో చిన్నారెడ్డి స్థానంలో మేఘా రెడ్డికి, బోథ్‌లో వెన్నెల అశోక్‌ స్థానంలో నరేశ్‌ జాదవ్‌కు టికెట్‌ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అటు ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లందు, వైరాలు అభ్యర్థులను ప్రకటించటంతో పాటుగా..సీపీఐకు కేటాయించినట్లుగా చెప్తున్న కొత్తగూడెంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సూర్యాపేట దామోదర్ రెడ్డి, రమేష్ రెడ్డి మధ్య పోటీ ఉంది. తుంగతుర్తి సీటు కోసం పోటీ కొనసాగుతోంది. కామారెడ్డి నుంచి రేవంత్ పోటీ దాదాపు ఖరారయింది. దీంతో షబ్బీర్ అలీకి నిజామాబాద్ అర్బన్ సీటును జాబితాలో ప్రకటించటం లాంఛనంగా కనిపిస్తోంది. ఐతే చివరి నిమిషంలో అర్బన్‌ సీటు కోసం సంజయ్ పేరు తెర మీదకు వచ్చింది.

YS Sharmila : తండ్రి కొడుకులను మించిన తెలంగాణ ద్రోహులు ఇంకెవ్వరు.. వైఎస్ షర్మిల

బాన్సువాడలో ఏనుగు బాలరాజు, రవీందర్ రెడ్డి మధ్య సీటు కోసం పోటీ కనిపిస్తోంది. నారాయణఖేడ్‌లో సంజీవరెడ్డి, సురేశ్ షెట్కర్‌లో ఎవరికి సీటు కేటాయిస్తారనేది తేలాల్సి ఉంది. చెన్నూరు నుంచి మాజీ ఎంపీ వివేక్ కానీ ఆయన కుమారుడు కానీ పోటీ చేయటం ఖాయమైంది. పటాన్‌చెరులో కాట శ్రీనివాస గౌడ్‌తో పాటుగా నీలం మధు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డోర్నకల్ పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మిగిలిన 19 స్థానాలతో పాటు.. మార్పు చేస్తున్న నియోజకవర్గాలు ఏంటి, అభ్యర్థులు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. దీంతో ఫైనల్ లిస్ట్‌ కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్ పుట్టిస్తోంది.