CM KCR: కామారెడ్డి నుంచి పోటీకి ఓ కారణం ఉంది.. అసలు విషయం చెప్పిన కేసీఆర్‌..

జ్వేల్‌లో కేసీఆర్‌కు తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఆయనకు ఓటమి భయం పట్టుకుందని విమర్శలు మొదలు పెట్టారు. ఓటమి భయంతోనే రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాడంటూ చెప్పారు. ఇప్పటి వరకూ ఈ విషయంలో ఎలాంటి రియాక్షన్‌ ఇవ్వని కేసీఆర్‌ ఇప్పుడు ఈ విషయం స్పందించారు.

  • Written By:
  • Publish Date - October 20, 2023 / 07:08 PM IST

CM KCR: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేయబోతున్నానంటూ సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌తో పాటు.. కామారెడ్డిలో కూడా పోటీ చేస్తానంటూ ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ కోసం అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న గంపా గోవర్ధన్‌ తన స్థానాన్ని త్యాగం చేశారు. సీఎం నిర్ణయంతో ప్రతిపక్షాలు మాటల తూటాలు మొదలు పెట్టాయి. గజ్వేల్‌లో కేసీఆర్‌కు తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఆయనకు ఓటమి భయం పట్టుకుందని విమర్శలు మొదలు పెట్టారు. ఓటమి భయంతోనే రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాడంటూ చెప్పారు.

ఇప్పటి వరకూ ఈ విషయంలో ఎలాంటి రియాక్షన్‌ ఇవ్వని కేసీఆర్‌ ఇప్పుడు ఈ విషయం స్పందించారు. గజ్వేల్‌లో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ చెప్పారు. గజ్వేల్‌ నాయకులు గజ్వేల్‌తో పాటు చుట్టూ ఉన్న నియోజకవర్గాల్లోని అభ్యర్థులకు కూడా ప్రచారంలో సాయం చేయాలంటూ కోరారు. రాష్ట్రానికే తలమానికంగా గజ్వేల్‌ను తీర్చిదిద్దుతామంటూ కార్యకర్తలకు మామీ ఇచ్చారు. ఇక కామారెడ్డి గురించి కూడా కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు కొన్ని కారణాలు ఉన్నాయని.. త్వరలోనే పార్టీ నేతలకు ఆ కారణాలు చెప్తానంటూ చెప్పారు. ప్రతిపక్షాలు చేస్తున్న అర్థం లేని వాదనకు పార్టీ నేతలు స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. కాగా చాలా కాలం నుంచి ఈ విషయంలో అటు పార్టీ నేతలతో పాటు ఇటు ప్రజల్లో కూడా కాస్త కన్ఫ్యూజన్‌ ఉంది.

గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా కేసీఆర్‌ ఎందుకు పోటీ చేస్తున్నారు అనేది అందరి డౌట్‌. బీఆర్‌ఎస్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. కేసీఆర్‌ పూర్వీకులు ఉన్న ప్రాంతం ఇప్పటి కామారెడ్డి కిందకే వస్తుందట. అక్కడ ప్రాజెక్టుల కారణంగా తమ భూములు పోగొట్టుకుని తరువాత చింతమడకకు కేసీఆర్‌ పూర్వీకులు తరలి వెళ్లారట. ఈ సెంటిమెంట్‌ కారణంగానే కేసీఆర్‌ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అనేది పార్టీ అంతర్గత సమాచారం. కేసీఆర్‌కు ఓటమి భయం లేదని.. ఆయన గతంలో కూడా రెండు స్థానాల నుంచి పోటీ చేశారని బీఆర్‌ఎస్‌ నేతలు చెప్తున్నారు. తమ పార్టీ ఎవరికీ భయపడాల్సిన దుస్థితిలో లేదని.. తెలంగాణలో మరోసారి వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.