CM KCR: తెలంగాణ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయ్. కేసీఆర్ మీద గజ్వేల్‌లో పోటీ చేసేందుకు ఈటల సిద్ధం అవుతున్నారు. హుజురాబాద్‌తో పాటు గజ్వేల్ నుంచి కూడా బరిలో దిగుతానని ఈటల ప్రకటించారు కూడా ! ఇక అటు కేసీఆర్ కూడా గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు సిద్ధం కావడం కొత్త చర్చకు కారణం అవుతోంది. దీంతో రాజకీయం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ కేసీఆర్ తిరుగులేని మెజారిటీ విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయ్.
ఐతే గ్రౌండ్ లెవల్‌లో సీన్ వేరేలా ఉందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. గజ్వేల్‌లో కేసీఆర్‌కు ఎదురుగాలి తప్పేలా లేదు. 2014, 2018 ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేసిన కేసీఆర్.. అఖండ మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి మాత్రం సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే.. వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. పేరుకు సీఎం అయినా.. నియోజకవర్గ జనాలకు కేసీఆర్ ఎప్పుడూ అందుబాటులో ఉండరని.. ఉద్యమకారులను కూడా కేసీఆర్ మర్చిపోయారని.. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇవ్వడం లేదని.. గజ్వేల్‌లో కారు పార్టీ శ్రేణులు వాపోతున్నారట. దీంతో ప్రత్యర్థి వర్గానికి మద్దతు ఇవ్వాలని కేసీఆర్ అసమ్మతి నేతలంతా డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. గజ్వేల్‌లో కేసీఆర్‌కు పోటీగా బీజేపీ నుంచి ఈటల పోటీ చేయబోతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్‌లోని అసమ్మతి నేతలంతా.. ఈటల వెంట నడిస్తే.. ఎలక్షన్ సీన్ మారిపోయే అవకాశాలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఇదే అదనుగా కొత్త చర్చ కూడా జరుగుతోంది.
గజ్వేల్ ఓటమిని ముందు గ్రహించారు కాబట్టే.. కేసీఆర్ కామారెడ్డిని కూడా ఎంచుకున్నారని మరికొందరు అంటున్నారు. ఇక అటు గజ్వేల్‌లో ముదిరాజ్ ఓటర్లు కీలకం కానున్నారు. ఇప్పుడు వాళ్లంతా బీఆర్ఎస్, కేసీఆర్‌కు వ్యతిరేకంగా మారారు. తమకు ప్రాధాన్యం కల్పించాలని ఈ మధ్యే భారీ ర్యాలీ కూడా చేశారు. ఐతే అదే సామాజికవర్గానికి చెందిన ఈటల.. గజ్వేల్ నుంచి పోటీ చేస్తే రాజకీయం మరింత రసవత్తరంగా మారే చాన్స్ ఉంటుంది. అదే సమయంలో కేసీఆర్ అసమ్మతి నేతలు కూడా ఈటలతో చేతులు కలిపితే.. గజ్వేల్‌లో సీన్ టోటల్‌గా మారిపోయే చాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది.