Tula Umas : తుల ఉమ ఇంటికి క్యూ కడుతున్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు..

తుల ఉమ (Tula Umas) కు బీజేపీ టికెట్‌ రద్దు చేయడంతో వేములవాడ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. బీజేపీకి బద్ద శతృవుగా చెప్పుకునే కాంగ్రెస్‌ పార్టీ నేతలు తుల ఉమ ఇంటికి వచ్చారు.

తుల ఉమ (Tula Umas) కు బీజేపీ టికెట్‌ రద్దు చేయడంతో వేములవాడ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. బీజేపీకి బద్ద శతృవుగా చెప్పుకునే కాంగ్రెస్‌ పార్టీ నేతలు తుల ఉమ ఇంటికి వచ్చారు. స్థానిక కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్‌ తుల ఉమ ఇంటికి వెళ్లి ఆమెను కలిశారు. కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. ఆది శ్రీనివాస్‌ వెళ్లిన తరువాత బీఆర్‌ఎస్‌ నేతలు కూడా తుల ఉమతో మాట్లాడినట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌ (BRS) లో జాయిన్‌ అయితే మంచి స్థానం కల్పిస్తామని ఆఫర్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తుల ఉమ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ముందు నుంచి తుల ఉమకు టికెట్‌ కేటాయిస్తారని అంతా అనుకున్నారు.

KCR SKETCH : కేసీఆర్ భలే స్కెచ్ ..! వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు ప్లాన్

బీజేపీ హైకమాండ్‌ కూడా ఉమ పేరును ఖరారు చేసింది. కానీ లాస్ట్‌ మినట్‌లో ఉమకు కాకుండా వికాస్‌ రావుకు టికెట్‌ కేటాయించింది బీజేపీ. దీంతో మీడియా సాక్షిగా కన్నీరు పెట్టుకున్నారు ఉమ. బీజేపీ తనను నమ్మించి గొంతు కోసిందంటూ ఆరోపించారు. మళ్లీ ఎవరైనా బీజేపీ నుంచి తనకు ఫోన్‌ చేస్తే చెప్పు తీసుకుని కొడతానంటూ ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు. ఉద్యమ సమయం నుంచి తుల ఉమ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. ఈటెల రాజేందర్‌ అనుచరురాలిగా ఉమకు పేరుంది. ఆమెకు ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పించేందుకు రాజేందర్‌ కూడా ప్రయత్నాలు జరిపారు. కానీ ఆఖరి నిమిషంలో ఉమకు టికెట్‌ రాకపోవడంతో వేములవాడ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఉమకు రెండు పార్టీల నుంచి సమాన అవకాశాలు ఆఫర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది చూడాలి.