Ponnala Lakshmaiah: ఢిల్లీకి రమ్మని రాహుల్‌ నుంచి ఫోన్‌.. పొన్నాల రియాక్షన్‌ తెలిస్తే షాక్ అవుతారు..

రాహుల్ గాంధీ అభ్యర్థనను పొన్నాల లక్ష్మయ్య తిరస్కరించారని కూడా వార్తలు వస్తున్నాయ్. గతంలో బీసీ నేతలకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని రాహుల్‌కు.. ఇప్పుడు బీసీలు గుర్తుకు వచ్చారా అని పొన్నాల ఘాటుగా ఆన్సర్ ఇచ్చారని తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - October 27, 2023 / 12:45 PM IST

Ponnala Lakshmaiah: కాంగ్రెస్‌లోనే రాజకీయ ఓనమాలు స్టార్ట్ చేసి.. మంత్రిగా పనిచేసి.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించిన సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య. ఈ మధ్యే హస్తానికి హ్యాండ్ ఇచ్చి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేయగా.. ఈ విషయంపై రాహుల్ ఆఫీస్‌ నుంచి ఫోన్ వచ్చిందని తెలుస్తోంది. ఆయనను ఢిల్లీకి పిలిచినట్లు.. సోషల్‌ మీడియా కోడై కూస్తోంది.

అయితే రాహుల్ గాంధీ అభ్యర్థనను పొన్నాల లక్ష్మయ్య తిరస్కరించారని కూడా వార్తలు వస్తున్నాయ్. గతంలో బీసీ నేతలకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని రాహుల్‌కు.. ఇప్పుడు బీసీలు గుర్తుకు వచ్చారా అని పొన్నాల ఘాటుగా ఆన్సర్ ఇచ్చారని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో ఏళ్ల నుంచి ఉన్నవారిని కనీసం పట్టించుకోని రాహుల్ గాంధీ.. పార్టీ వీడిన తర్వాత గుర్తుకు వచ్చారా అంటూ మండిపడినట్టు ప్రచారం జరుగుతోంది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్.. సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌‌లలో పొన్నాలకు సంబంధించిన ఇదే వార్త తెగ వైరల్ అయింది. ఐతే దీనిపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తనకు ఎవరూ ఫోన్ చెయ్యలేదని క్లారిటీ ఇచ్చారు.

45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ సేవ చేసిన పార్టీలో అనేక అవమానాలు భరించి.. తాను ఓ రాజకీయ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చారు. బీసీలను చీడ పురుగులను చూసినట్టు రేవంత్ రెడ్డి ప్రవర్తన ఉందని విమర్శించారు. ఇలాంటి చిల్లర ప్రచారాలకు ప్రభావితం అయ్యే వ్యక్తిని కాదన్నారు. ఈ ప్రచారాన్ని పొన్నాల తిప్పికొట్టారు. దీంతో వైరల్ ప్రచారానికి ఎండ్‌ కార్డ్ పడినట్లు అయింది.