Neelam Madhu: నీలం మధుకు నో బీఫామ్‌.. అట్టుడికిపోతున్న పఠాన్‌చెరు రాజకీయం..

పఠాన్‌చెరు కాంగ్రెస్‌ అభ్యర్థిగా నీలం మధును ప్రకటించింది కాంగ్రెస్‌ పార్టీ. దీంతో ముందు నుంచీ అక్కడ టికెట్‌ ఆశిస్తున్న కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ ఒక్కసారిగా ఫైర్‌ అయ్యారు. ఆయన అనుచరులు రోడ్డెక్కి ధర్నాలు చేశారు. ఏకంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఇంటినే ముట్టడించారు.

  • Written By:
  • Publish Date - November 8, 2023 / 06:00 PM IST

Neelam Madhu: రాజకీయాల్లో.. అదీ కాంగ్రెస్‌ (CONGRESS) పార్టీలో పరిణామాలు చాలా వేగంగా మారిపోతుంటాయి. అభ్యర్థిగా ప్రకటించినా.. ప్రచారం హోరెత్తించినా.. బీఫామ్‌ చేతికి వచ్చే వరకూ ఎమ్మెల్యే టికెట్‌ మీద నమ్మకం ఉండటం లేదు. రీసెంట్‌గా బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌కు వచ్చిన నీలం మధు ముదిరాజ్‌ విషయంలో ఇదే జరిగింది. పఠాన్‌చెరు (Patancheru) కాంగ్రెస్‌ అభ్యర్థిగా నీలం మధు (Neelam Madhu)ను ప్రకటించింది కాంగ్రెస్‌ పార్టీ. దీంతో ముందు నుంచీ అక్కడ టికెట్‌ ఆశిస్తున్న కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ ఒక్కసారిగా ఫైర్‌ అయ్యారు.

TELANGANA CONGRESS: చార్మినార్‌ స్థానం ఎందుకు పెండింగ్‌.. కాంగ్రెస్‌ అసలు ప్లాన్ తెలిస్తే షాక్ అవుతారు..

ఆయన అనుచరులు రోడ్డెక్కి ధర్నాలు చేశారు. ఏకంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఇంటినే ముట్టడించారు. మాజీ మంత్రి దామోదర రాజనరసింహ కూడా కాటా శ్రీనివాస్‌కు మద్దతు తెలిపారు. శ్రీనివాస్‌ గౌడ్‌ అనుచరులు గాంధీ భవన్‌ ముందు ధర్నా చేశారు. దీంతో రీసెంట్‌గా ఎప్పుడూ లేనిది గాంధీ భవన్‌కు తాళాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు జగ్గారెడ్డి కూడా నీలం మధుకు టికెట్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. పఠాన్‌చెరు అభ్యర్థిని మార్చకపోతే.. తాను వేరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్‌ ఇచ్చారు. దీంతో హైకమాండ్‌ చేతులెత్తేసింది. బీఫామ్‌ తీసుకునేందుకు గాంధీ భవన్‌కు వచ్చిన నీలం మధుకు మొండి చెయ్యి చూపించింది. పఠాన్‌చెరులో ఉన్న పరిస్థితి నేపథ్యంలో బీఫామ్‌ ఇవ్వలేమంటూ చెప్పేసింది. కాటా శ్రీనివాస్‌తో కలిసి వస్తేనే బీఫామ్‌ ఇస్తామని కాంగ్రెస్‌ పెద్దలు మధుతో చెప్పినట్టు సమాచారం. కానీ పఠాన్‌చెరులో ఉన్న పరిస్థితి వేరు. మధు సైలెంట్‌గానే ఉన్నా.. శ్రీనివాస్‌ అనుచరులు మాత్రం మధు పేరు చెప్తేనే మండిపోతున్నారు.

Teenmar Mallanna: అంతన్నావ్‌.. ఇంతన్నావ్‌.. కాంగ్రెస్‌లో చేరావ్‌.. వాటీజ్ దిస్ మల్లన్న..

ఇలాంటి టైంలో ఏం చేయలేని స్థితిలో ఉన్నారు మధు. దీంతో బీఫామ్ తీసుకోకుండానే పఠాన్‌చెరుకు వెళ్లిపోయారు. ప్రస్తుతానికి ఆ బీఫామ్‌ ఇంకా ఎవరికీ ఇవ్వలేదు. ఇప్పుడు టీపీసీసీ ఏం చేయబోతోంది అనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇద్దరు నేతలను కూర్చోబెట్టి సర్దిచెప్తారా..? లేక పరిస్థితికి తలవంచి కాటా శ్రీనివాస్‌కు టికెట్‌ కేటాయిస్తారా అనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలో ఉంది. మరి కాంగ్రెస్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.