Karnataka Power politics : కర్ణాటకలో 5 గంటలే కరెంట్ ..? కుమారస్వామి విమర్శలతో కొత్త రచ్చ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) ప్రచారంలో విద్యుత్ సరఫరాపై కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ మధ్య రచ్చకు దారితీస్తోంది. తెలంగాణలో విద్యుత్ సప్లయ్ కి భరోసా ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటక (Karnataka) లో ఏం వెలగబెడుతుందో గమనించాలని BRS కోరుతోంది. కర్ణాటకలో రైతులకు 5 గంటల పవర్ ఇవ్వడానికి దిక్కులేదని.. తెలంగాణలో ఎలా సాధ్యమవుతుందని BRS చీఫ్ కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఇక ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అయితే.. కరెంట్ కావాలో.. కాంగ్రెస్ కావాలో తేల్చుకోవాలని కోరుతున్నారు. ఇదే టైమ్ లో కర్ణాటకలో జేడీఎస్ అధినేత కుమార స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ ని ఇరాకటంలోని నెట్టాయి.

KCR SKETCH : కేసీఆర్ భలే స్కెచ్ ..! వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు ప్లాన్

కర్ణాటకలో ఐదు గ్యారంటీలేవీ అమలు కావడం లేదంటున్నారు జేడీఎస్ చీఫ్ కుమార్ స్వామి. ఐదు గ్యారంటీల్లో నాలుగు అమలు చేశామని.. సీఎం సిద్ధరామయ్య తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు. అసలు ఇక్కడ ఏ హామీలు అమలు అవుతున్నాయని కుమార స్వామి ప్రశ్నించారు. కర్ణాటకలో ఐదు గంటల పవర్ కే దిక్కులేదు.. తెలంగాణలో 24 గంటలు ఇస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎలా చెబుతారని మండిపడ్డారు. కర్ణాటక రైతులకు 20 గంటల పవర్ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు కనీసం 5గంటల పవర్ సప్లయ్ కూడా లేదు.. సబ్ స్టేషన్లకు వెళ్లితే కాంగ్రెస్ బండారం బయటపడుతుందని విమర్శించారు కుమారస్వామి. ఈ సంచలన వ్యాఖ్యలు కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ఒట్టిదేనా.. బీఆర్ఎస్ చెబుతోంది నిజమేనా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

కర్ణాటకలో విద్యుత్ కొరతపై బీజేపీ, జేడీఎస్ ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నాయి. ఆ రాష్ట్రంలో కరువు పరిస్థితుల వల్ల విద్యుత్ ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం తాము హామీ ఇచ్చినట్టుగా 20 గంటల నిరంతర విద్యుత్ కాకుండా .. 5 గంటలైనా ఇస్తామని చెబుతోంది. రైతులకు 3 షిఫ్టుల్లో పగటిపూట, రాత్రిపూట.. మొత్తం 5 గంటల పాటు పవర్ ఇస్తామని కర్ణాటక రాష్ట్ర మంత్రి కేజే జార్జ్ చెప్పారు. కర్ణాటక ప్రభుత్వంపై పరిశ్రమల వర్గాలు కూడా మండిపడుతున్నాయి. పవర్ కట్స్, లోడ్ షెడ్డింగ్ కారణాలతో.. పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతున్నాయని అంటున్నారు.

సరే కర్ణాటక పరిస్థితులే ఇక్కడ కూడా రిపీట్ అవుతాయా అంటే చెప్పలేం. ప్రస్తుతం BRS ప్రభుత్వం ఎక్కువ డబ్బులు పెట్టయినా సరే రాష్ట్రంలో 24 గంటల కరెంట్ అందిస్తోంది. ఉమ్మడి ఏపీలో కూడా పవర్ కట్స్ తో చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఖచ్చితంగా అలాంటి పరిస్థితి తలెత్తదు అని కాంగ్రెస్ తెలంగాణలో ఏ మేరకు హామీ ఇస్తున్నది చూడాలి. కానీ హామీల అమలు విషయంలో కర్ణాటకతో పోల్చుకుంటే మాత్రం ఇక్కడ కాంగ్రెస్ కి ఇబ్బందులు తప్పేలా లేవు.