Cyclone Michoung : ఆంధ్రప్రదేశ్ కు పొంచి ఉన్న మిచౌంగ్ తుఫాన్.. తెలంగాణలో వర్షాలు..

ఏపీలో పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ఆగ్నేయా బంగాళఖాతంలో ఏర్పటిన అల్పపీడనం..తీవ్ర మిచౌంగ్ తుఫాన్ గా ఆవర్తనం చెంది.. కోస్తా తీర ప్రాంతానికి దూసుకోస్తొంది. ఇక ఏపీకి మిచౌంగ్ తుఫాన్ ముప్పు పొంచి ఉండటంతో ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఎక్కువగా.. కోస్తాలోని జిల్లాలపై కనిపిస్తోంది. ఈ క్రమంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజల్ని అప్రమత్తం చేసింది. ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

నేడు కోస్తా తీరానికి సమాంతరంగా పయనిస్తు.. రేపు మధ్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక, తెలంగాణపై కూడా ఈ మిచౌంగ్ తుపాను ప్రభావం చూపనుంది. దీంతో.. నేడు, రేపు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ప్రజలు ఎవ్వరు కూడా ఎలాంటి పుకార్లను నమ్మవద్దని.. ప్రశాంతంగా ఉండాలని.. సూచించారు. అత్యవసర కమ్యూనికేషన్ కోసం మీ మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకుంటూ ఉండాలని సూచించారు. వాతావరణ హెచ్చరికల కోసం మెసేజ్‌లను గమనిస్తూ ఉండాలన్నారు. ప్రజలు విలువైన పత్రాలు, సర్టిఫికేట్స్, విలువైన వస్తువుల్ని వాటర్ ప్రూఫ్ కంటైనర్లు, కవర్‌లో ఉంచి జాగ్రత్త చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు సూచించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు

తెలంగాణపై మిచౌంగ్ తుఫాన్‌ ప్రభావం..
తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి భారీ ఇదురు గాలులు వీస్తున్నాయి. నేడు, రేపు తెలంగాణవ్యాప్తంగా ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురువనున్నాయి. దీంతో తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నేడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఎల్లో అలెర్ట్ జారీ
ఈదురు గాలులు గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తతగా ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచించింది.

రాష్ట్రాంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. రేపు నల్గొండ, మహబూబాబాద్, వరంగల్ , హన్మకొండ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుండి 50 కి.మీల వేగంతో వీచే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగే అవకాశం
ఉదయం వేళల్లో దట్టమైన పొగ మంచు ఉండే అవకాశం ఉంది.