Damodara Rajanarsimha : ఐఏఎస్ అవుదామని.. మంత్రి అయ్యారు

ఐఏఎస్ కావాలని కలలు కని.. చివరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు దామోదర రాజనర్సింహ. 34యేళ్ళుగా అందోల్ లో ప్రజా సేవ చేస్తూ మరోసారి అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు దామోదర రాజనర్సింహ.

Khammam, Politics : ఖమ్మం పాలిటిక్స్ లో తుమ్మల హవా..

1958లో జన్మించిన రాజనర్సింహ.. హైదరాబాద్ లో ఇంజినీరింగ్ చదివారు. ఐఏఎస్ అవ్వాలని సివిల్స్ కి ప్రిపేర్ అయ్యారు కూడా. తర్వాత అందోల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అక్కడే అనేక విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. JNTU, పాలిటెక్నిక్, మహిళా పాలిటెక్నిక్, వ్యవసాయ పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీలు, మోడల్ స్కూళ్ళు ఇలా ఎన్నో విద్యాసంస్థలు ఆందోల్ లో నిర్వహించారు దామోదర రాజనర్సింహ.

1989లో ఆయన తండ్రి, మాజీ మంత్రి రాజనర్సింహ చనిపోవడంతో… దామోదర రాజనర్సింహ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదే ఏడాదిలో అందోల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత రెండు సార్లు ఓడినా.. 2004లో బాబూ మోహన్ పై గెలిచారు. 2006లో వైఎస్సార్ హయాంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2009లో మళ్ళీ గెలిచిన తర్వాత దామోదర రాజనర్సింహకు.. మంత్రి పదవులు దక్కాయి. 2010లో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో కూడా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ టైమ్ లో ఈ ప్రాంతానికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ వచ్చింది. దాంతో దామోదరను 2011లో డిప్యూటీ సీఎం నియమించారు.

2014, 2018 ఎన్నికల్లో దామోదర ఓడిపోయారు. 2023 ఆగస్టులో CWC లో శాశ్వత ఆహ్వానితుడిగా నియమితులయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ పై 28 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రేవంత్ కేబినెట్ లో దామోదర రాజనర్సింహకు స్థానం దక్కింది.