సీఎంను ఓడించాడు.. కాబోయే సీఎంనూ ఓడించాడు.. ఎవరీ వెంకటరమణా రెడ్డి..

తెలంగాణ ఎన్నికల కౌంటింగ్‌ మొత్తం ఒకలా ఉంటే కామారెడ్డి లెక్క మాత్రం వేరేలా ఉంది. ప్రతీ రౌండ్‌లో పరిస్థితి మారిపోయింది. సింపుల్‌గా చెప్పాలంటే ఓ థ్రిల్లర్‌ సినిమాను తలపించింది కామారెడ్డి కౌంటింగ్‌. షాక్‌లు.. ట్విస్ట్‌లు.. ఝలక్‌లు దెబ్బ మీద దెబ్బ అన్నట్టు.. ఆఖరి క్షణం వరకూ ఉత్కంఠ రేపింది కామారెడ్డి ఓట్ల లెక్కింపు ప్రక్రియ. మాజీ సీఎం కేసీఆర్‌ కేసీఆర్‌, కొత్తగా సీఎం కాబోయే రేవంత్ రెడ్డి ఇద్దరూ ఇక్కడి నుంచి పోటీ చేశారు.

తెలంగాణ ఎన్నికల కౌంటింగ్‌ మొత్తం ఒకలా ఉంటే కామారెడ్డి లెక్క మాత్రం వేరేలా ఉంది. ప్రతీ రౌండ్‌లో పరిస్థితి మారిపోయింది. సింపుల్‌గా చెప్పాలంటే ఓ థ్రిల్లర్‌ సినిమాను తలపించింది కామారెడ్డి కౌంటింగ్‌. షాక్‌లు.. ట్విస్ట్‌లు.. ఝలక్‌లు దెబ్బ మీద దెబ్బ అన్నట్టు.. ఆఖరి క్షణం వరకూ ఉత్కంఠ రేపింది కామారెడ్డి ఓట్ల లెక్కింపు ప్రక్రియ. మాజీ సీఎం కేసీఆర్‌ కేసీఆర్‌, కొత్తగా సీఎం కాబోయే రేవంత్ రెడ్డి ఇద్దరూ ఇక్కడి నుంచి పోటీ చేశారు. ఇద్దరిలో ఎవరు గెలుస్తారని రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసింది. కానీ.. వీళ్లిద్దరికీ షాకిస్తూ అక్కడ మూడో వ్యక్తి అడుగు పడింది. ఆయనే బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి. గత 40 ఏళ్లలో ఓటమి ఎరగని కేసీఆర్‌ను.. దాదాపు 6 వేల మెజార్టీతో ఓడించారు రమణా రెడ్డి. దీంతో రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఆయన వైపు చూస్తోంది. అనూహ్యంగా బీజేపీ నుంచి గెలిచిన వెంకటరమణ రెడ్డి వయస్సు 53 ఏళ్లు. వృత్తి రిత్యా వ్యాపారవేత్త అయిన వెంకటరమణ రెడ్డి చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు.

గతంలో చాలా పదవుల్లో పని చేశారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో.. జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా కూడా పని చేశారు. ఆ రాజకీయ అనుభవంతో ఈసారి ఆయనకు ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించింది బీజేపీ. పార్టీ జెండా పాతేందుకు ముందునుంచీ చాలా వ్యూహాత్మకంగా పనిచేశారు వెంకటరమణా రెడ్డి. తన ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో సక్సెస్‌ అయ్యాడు. కానీ ఇక్కడి నుంచి స్వయంగా సీఎం కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డి ఇద్దరూ పోటీ చేయడంతో వెంకటరమణా రెడ్డి ఓడిపోతారని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేశారు వెంకటరమణా రెడ్డి. పది వంద కాదు.. ఏకంగా 6 వేల ఓట్ల తేడాతో కేసీఆర్‌ మీద గెలిచాడు. కేవలం కేసీఆర్‌ మాత్రమే కాదు. కాబోయే సీఎం రేవంత్ రెడ్డిని కూడా వెంకటరమణా రెడ్డి ఓడించినట్టే. దీంతో ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించిన వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు వెంకటరమణా రెడ్డి