India Today Exit Polls : ఇండియా టుడే ఎగ్జిట్‌పోల్‌పై చర్చ.. 2018లో ఏం చెప్పిదంటే..

తెలంగాణలో మరికొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయ్. ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్‌పోల్స్ అన్నీ కాంగ్రెస్‌దే అధికారం అంటుంటే.. ఎగ్జిట్‌పోల్స్ అన్నీ నిజం కాదని.. ఎగ్జాక్ట్ పోల్ ఏంటో డిసెంబర్‌ 3న చూస్తారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మిగతా ఎగ్జిట్‌పోల్స్ సంగతి ఎలా ఉన్నా.. ఇండియాటుడే సర్వేపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.

తెలంగాణలో మరికొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయ్. ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్‌పోల్స్ అన్నీ కాంగ్రెస్‌దే అధికారం అంటుంటే.. ఎగ్జిట్‌పోల్స్ అన్నీ నిజం కాదని.. ఎగ్జాక్ట్ పోల్ ఏంటో డిసెంబర్‌ 3న చూస్తారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మిగతా ఎగ్జిట్‌పోల్స్ సంగతి ఎలా ఉన్నా.. ఇండియాటుడే సర్వేపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. ఓటింగ్‌ శాతం పూర్తిగా రాకముందే.. మిగతా సంస్థలన్నీ సర్వేలు ప్రకటించగా.. ఇండియాటుడే మాత్రం ఒకరోజు ఆగి.. పూర్తి పోలింగ్ శాతం వచ్చాక.. తమ రిపోర్ట్ ప్రకటించింది. ఇదంతా ఎలా ఉన్నా.. 2018 తెలంగాణ ఎన్నికల్లో ఇండియాటుడే ఎగ్జిట్‌పోల్స్‌ నిజం అయింది.

Telangana Elections : బీజేపీని చూసి ఆ పార్టీలకు వణుకు.. ఆ నేతలకు నిద్రలేకుండా చేస్తున్న కమలం..

దీంతో ఇప్పుడేం జరగబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సారి కాంగ్రెస్ 63 నుంచి 73, బీఆర్ఎస్‌కు 34 నుంచి 44 సీట్లు, బీజేపీకి 4 నుంచి 8, ఇతరులకు 5 నుంచి 8 సీట్లు వస్తాయని ఇండియాటుడే సంస్థ ఎగ్జిట్‌పోల్స్‌లో తేలింది. ఇది నిజం కాదని.. ఫలితం వేరేలా ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు అంటుంటే.. ఇదే నిజం, 2018 ఫలితాలు గుర్తులేదా అంటూ కాంగ్రెస్‌ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయ్. 2018లో ఇండియా టుడే మై యాక్సిస్ సంస్థ.. బీఆర్ఎస్‌కు 79 నుంచి 91 సీట్లు వస్తాయని తెలపగా.. కారు పార్టీ 88 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్‌కు 21 నుంచి 33 సీట్లు వస్తాయని చెప్పగా 21 స్థానాల్లో విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్‌లో లాస్ట్ టర్మ్‌లో చెప్పిన లెక్కలు కరెక్ట్ కావడంతో ఈ సారి ఓటరు నాడి ఈ సంస్థకు చిక్కిందా.. లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. సర్వే సంగతి ఎలా ఉన్నా.. ఇండియా టుడే ఎగ్జిట్‌పోల్‌పై బీఆర్ఎస్‌, కాంగ్రెస్ మధ్య యుద్ధం మాత్రం పీక్స్‌కు చేరింది.