తెలంగాణ ఎన్నికలు ముగిసాయి.. ఇక ఓట్ల లెక్కింము మాత్రమే మిగిలి ఉంది. ఈ సారి తెలంగాణ ను ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ గెలుపు ఖాయం అనే దీమాతో ఉంది. తెలంగాణలో ఈసారి ఎలగైన అధికారం హస్తగతం చేసుకోవాలని ఢీల్లీ నుంచి బెంగూళుర్ ముఖ్య నేతలు తెలంగాణలో ముంబర ప్రచారం చేశారు. దాదాపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ కూడా తెల్చి చెప్పేసాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పాటు అగ్రనేతల కష్టం కూడా ఫలించబోతోందనే అంచనాలతో కౌంటింగ్ ప్రక్రియపై అంత్యంత జాగ్రత్తతో వ్యవహరిస్తోంది. కాగా ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో మరో అంశం చర్చనియంగా మారింది. ఈ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు పార్టీ పిరాయిస్తారు అనే భయంతో.. గెలిచిన ఎమ్మెల్యేలను రాష్ట్రం దాటించేయలని.. కాంగ్రెస్ అదిష్టానం యోచిస్తుంది. ఈ ప్రక్రియను కార్ణటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దగ్గరుండి చూస్తున్నట్లు వార్తు వస్తున్నాయి.
Telangana Elections : తెలంగాణ ఎన్నికలపై వెయ్యి కోట్ల బెట్టింగులు..
ఈ నేపథ్యంలోనే నేడు తెలంగాణకు డీకే శివకుమార్ వస్తున్నారు. తాజాగా డీకే కీలక వ్యాక్యలు చేశారు. ఈ సారి కాంగ్రెస్ గెలుపు ఖాయం అని అన్నారు. గెలుస్తున్న మా కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ ప్రభుత్వం కొనేందుకు యత్నిస్తుందని ఆరోపించారు. ఇందులో భాగంగానే తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు.. డీకే శివకుమార్ హైదరాబాద్ కు వస్తున్నారు. గెలుపు గుర్రాలు చేయజారిపోకుండా.. టీపీసీసీ రేవంత్ రెడ్డి కూడా అప్రమత్తంగా ఉన్నారు. అభ్యర్థులు అందరు కూడా అలెర్ట్ గా ఉండాలని.. పిలుపునిచ్చారు. తెలంగాణ ఫలితాలు వెలువడిన తర్వాత గెలిచిన వారిని క్యాంప్ కు పంపాలనే యోచనలో ఉన్నారు. ఇక తమ గెలుపు ఖాయమైందనే ప్రకటన వచ్చాక.. కొత్త ప్రభుత్వం కొలువతీరేంత వరకు పూర్తి బాధ్యతలను కాంగ్రెస్ అధిష్టానం డీకే శివకుమార్ కు అప్పించింది.
డీకే శివకుమార్ వ్యాఖ్యలు..
కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలను రిసార్ట్ లకు తరలిస్తామనే వార్తలు వదంతులే కానీ అందులో నిజం లేదు. సీఎం కేసీఆర్ ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలతో మాట్లాడినట్లు తెలిసింది.. కానీ మా ఎమ్మెల్యేలు పార్టీకి విధేయులు. ఎట్టి పరిస్థితిలో ప్రలోబాలకు లొంగరు. ఎగ్జిట్ పోల్స్ అన్ని తెలంగాణలో కాంగ్రెస్ విక్టరీ సాధిస్తుందని వెల్లడించాయి. ఇక.. వ్యక్తిగతంగా నాకు ఎగ్జిట్ పోల్స్ పై నమ్మకం లేదు. నేను సొంతంగా సర్వేలు చేసినప్పుడు లక్షకుపైగా శాంపిళ్లు తీసుకుంటాను. మీడియా చేసే శాంపిల్ సైజు కేవలం 5 – 6 వేలలోపే ఉంటుంది. ఆ సారి మధ్యప్రదేశ్ తెలంగాణ, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మధ్యప్రదేశ్ లో ఉన్న అవినీతి సర్కార్ ని సాగనంపాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అక్కడి బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది” అని అన్నారు.