Sarpanch, Navya : సర్పంచ్‌ నవ్యకు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా..

తెలంగాణ రాకీయాల్లో కొన్ని రోజుల పాటు హాట్ టాపిక్‌గా మారిన వ్యక్తి సర్పంచ్‌ నవ్య. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం, జానకీపురం సర్పంచ్‌గా ఉన్న నవ్య.. లోకల్‌

తెలంగాణ రాకీయాల్లో కొన్ని రోజుల పాటు హాట్ టాపిక్‌గా మారిన వ్యక్తి సర్పంచ్‌ నవ్య. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం, జానకీపురం సర్పంచ్‌గా ఉన్న నవ్య.. లోకల్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీద లైంగిక ఆరోపణలతో వైరల్‌ అయ్యారు. రాజయ్య తనను లైంగికంగా వేధించాడని మీడియా ముందుకు వచ్చి ఒక్కసారిగా టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయారు. ఆ తరువాత ఆమెకు ప్రతిపక్షాల నుంచి సోషల్‌ మీడియా నుంచి వచ్చిన హైప్‌ అంతా ఇంతా కాదు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌ ఓపెన్‌ చేస్తే చాలా నవ్య రీల్స్‌ కనిపించేవి. సోషల్‌ మీడియాలో క్రేజ్‌ వల్లో లేక నిజంగానే రాజకీయాలను మార్చాలి అనుకుందో తెలియదు కానీ.. నవ్య ఎమ్మెల్యే పోటీ చేయాలని నిర్ణయించుకుంది.

Cyclone Michoung : ఆంధ్రప్రదేశ్ కు పొంచి ఉన్న మిచౌంగ్ తుఫాన్.. తెలంగాణలో వర్షాలు..

తనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలంటూ కేటీఆర్‌ను కోరింది. ఒక్క అవకాశమిస్తే తానేంటో ప్రూవ్ చేసుకుంటానంటూ కోరింది. కానీ ఆమె రిక్వెస్ట్‌ను బీఆర్ఎస్‌ పార్టీ కన్సిడర్‌ కూడా చేయలేదు. అయినా వినకుండా ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసింది నవ్య. ఒంటరిగానే ప్రచారం కూడా నిర్వహించింది. దీంతో ఎన్నికలు ముగిసిన తరువాత నవ్యకు ఎన్ని ఓట్లు వచ్చాయి అనే విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. ఓట్ల లెక్కింపు పూర్తైన తరువాత నవ్యకు మొత్తం 1800 ఓట్లు పడ్డట్టు ఎన్నికల అధికారులు వెళ్లడించారు. దీంతో ఆమె డిపాజిట్‌ కోల్పోయారు. మొత్తం 2 లక్షల 10 వేల ఓట్లున్న స్టేషన్‌ ఘన్‌పూర్‌లో నవ్యకు కేవలం 1800 కోట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికల్లో గెలవలేకపోయినా.. పోటీ చేయాలనే ధైర్యం చేయడమే చాలా గొప్ప విషయమని అంతా అంటున్నారు.