సీఎం కేసీఆర్‌కు వ్యాపారాలు లేవు. వ్యవసాయమే ఆయన ప్రధాన ఆదాయ మార్గం. ఈ మాట చాలాసార్లు స్వయంగా కేసీఆర్ చెప్పారు. తనకు పొలం ఉందని.. అక్కడే ఇల్లు కట్టుకుని వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్పారు. తాను స్వయంగా రైతును కాబట్టే రైతుల బాధలు అందరికంటే ఎక్కువ నాకు తెలుసు అనేది కేసీఆర్ ఎప్పుడూ చెప్తున్న మాట. కానీ ప్రతిపక్ష నేతలు మాత్రం కేసీఆర్‌కు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తుంటారు. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్‌కు అసలు ఎన్ని ఆస్తులు ఉన్నాయన్న విషయం ఇంట్రెస్టింగ్‌గా మారింది. రీసెంట్‌గా ఎన్నికల సందర్భంగా తన ఆస్తుల వివరాలను ప్రకటించారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం కేసీఆర్‌కు 17 కోట్ల 83 లక్షల స్థిరాస్తులు ఉండగా.. 9 కోట్ల 67 లక్షల చరాస్తులు ఉన్నట్టు చూపించారు. ఇక కేసీఆర్ భార్య శోభ పేరు మీద 7 కోట్ల 78 లక్షల చరాస్తులు ఉన్నట్టు చెప్పారు. ఇద్దరికీ కలిపి ఉమ్మడి ఆస్తి కింద 9 కోట్ల 81 లక్షల విలువ చేసే చరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో చూపించారు. ఇక భూమి విషయానికి వస్తే ప్రస్తతం తన పేరుపైగా తన భార్య పేరుపై గానీ సెంటు భూమి కూడా లేదని చెప్పారు కేసీఆర్. తన పూర్వీకుల నుంచి వచ్చిన 62 ఎకరాల భూమి ఉమ్మడి ఆస్తిగా అలాగే ఉందని చెప్పారు. ప్రస్తుతం తన దగ్గర 2 లక్ష 96 వేల నగదు ఉండగా.. తన భార్య శోభ దగ్గర 6 కోట్ల 29 లక్షల నగదు ఉన్నట్టు చెప్పారు. 17 లక్షలు విలవ చేసే బంగారం కూడా ఉన్నట్టు చెప్పారు. ఇక అప్పులు కూడా అదే స్థాయిలో ఉన్నాయని.. తనకు 17 కోట్ల 27 లక్షల అప్పులు ఉన్నట్టు చెప్పారు కేసీఆర్. తన కుటుంబానికి సంబంధించి 7 కోట్ల 23 లక్షల అప్పులు ఉన్నట్టు చెప్పారు. అఫిడవిట్‌లో కేసీఆర్‌కు చెందిన వాహనాల వివరాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఎప్పుడూ భారీ కాన్వాయ్‌తో తిరగే కేసీఆర్‌కు కనీసం సొంత కారు కూడా లేదట. తనకు ఉన్నవన్నీ హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, జేసీబీలే తప్ప.. కార్లు బైక్‌లు లేవంటూ అఫిడవిట్‌లో చెప్పారు కేసీఆర్.
Revanth Reddy : నా దగ్గర గన్స్ ఉన్నాయి.. రేవంత్ ఎలక్షన్ అఫిడవిట్ వైరల్