Telangana Assembly Speaker : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక.. గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక ఏకగ్రీవం తథ్యమేనా..?

తెలంగాణ అసెంబ్లీలో శాసనసభ స్పీకర్ ఎన్నిక కోసం ఇవాళ నామినేషన్లు స్వీకరణ జరగనుంది. మూడో అసెంబ్లీ స్పీకర్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. నేడు గడ్డం ప్రసాద్ నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ల గడవు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ మధ్యాహ్నం 12. గంటల తర్వాత తన నామినేషన్ పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులకు అందజేస్తారు.

తెలంగాణ అసెంబ్లీలో శాసనసభ స్పీకర్ ఎన్నిక కోసం ఇవాళ నామినేషన్లు స్వీకరణ జరగనుంది. మూడో అసెంబ్లీ స్పీకర్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. నేడు గడ్డం ప్రసాద్ నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ల గడవు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ మధ్యాహ్నం 12. గంటల తర్వాత తన నామినేషన్ పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులకు అందజేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు అయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. నేడు గడ్డం ప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.

గడ్డం ప్రసాద్ ను స్పీకర్ గా నియమిస్తే.. ఏకగ్రీవంగా ఎన్నికైతే.. తెలంగాణ రాష్ట్ర తొలి దళిత స్పీకర్ అవుతారు. ప్రసాద్​ కుమార్​కు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్​కుమార్​ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. అలాగే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డం ప్రసాద్​ వికారాబాద్​ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి డాక్టర్ మెటుకు ఆనంద్ పై 12,893 ఓట్ల మెజారిటీతో భారత్ రాష్ట్ర సమితిపై విజయం సాధించారు. గడ్డం ప్రసాద్ కు మొత్తం 86,885 ఓట్లు పోలయ్యాయి. మీందుగా ఈ పదవికి కాంగ్రెస్ శ్రీధర్ బాబు పేరు ఉన్నపట్టికి.. అందుకు శ్రీధర్ బాబు మొగ్గు చూపడం లేక.. ఈ సారి తను మంత్రి పదవిలో పనిచేసేందుకు ప్రాధాన్యత ఇవ్వడంతో.. కాంగ్రెస్ అధిష్టానం ఆ అవకాశంను ప్రసాద్ కుమార్ ను వరించింది.