Etela Jamuna: మేడ్చల్‌ బరిలో ఈటెల భార్య జమున..!

బీఆర్‌ఎస్‌ను వీడిన నేతలను ఆకర్షించడంతో పాటు కీలక వ్యక్తులను ఎన్నికల బరిలో దింపేందుకు బీజేపీ ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మాజీ మంత్రి, హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భార్యను రంగంలోకి దించేందుకు బీజేపీ ఆలోచిస్తున్నట్టు టాక్‌.

  • Written By:
  • Publish Date - October 12, 2023 / 01:33 PM IST

Etela Jamuna: ఎన్నికల పోరుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్‌ లిస్ట్‌ కూడా దాదాపు రెడీ అయ్యింది. ఈ రెండు పార్టీలకు ధీటుగా అభ్యర్థులను బరిలోకి దింపేందుకు బీజేపీ సమాలోచనలు చేస్తోంది. ఈ నేపథ్యలో కొత్త పేర్లు, ఊహించని వ్యక్తులు తెరపైకి వస్తున్నారు. బీఆర్‌ఎస్‌ను వీడిన నేతలను ఆకర్షించడంతో పాటు కీలక వ్యక్తులను ఎన్నికల బరిలో దింపేందుకు బీజేపీ ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మాజీ మంత్రి, హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భార్యను రంగంలోకి దించేందుకు బీజేపీ ఆలోచిస్తున్నట్టు టాక్‌. అంతా సెట్‌ అయితే మేడ్చల్‌ స్థానం నుంచి ఈటెల జమున పోటీ చేస్తారని చర్చ జరుగుతోంది.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడూ రాకపోయినప్పటికీ ఈటలకు సబంధించిన ప్రతీ ఎన్నికలో ఈటెల జమున ప్రచారం చేశారు. హుజురాబాద్‌లో ప్రతీసారి ఈటలతో పాటు జమున ప్రచారం కీలకంగా ఉంటుంది. ఈ అనుభవంతో మేడ్చల్‌ నుంచి ఈటెల జమున పోటీలో ఉండబోతున్నారని బీజేపీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. బీఆర్ఎస్‌ మీద ఉన్న వ్యతిరేకత, ఈటెల రాజేందర్‌కు ఉన్న ఫాలోయింగ్‌ మేడ్చల్‌లో జమునకు కలిసివస్తాయని బీజేపీ భావిస్తోందట. నిజానికి జమున హుజురాబాద్‌ నుంచి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. కేసీఆర్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తే తాను కూడా అక్కడి నుంచే పోటీ చేస్తానని ఈటెల రాజేందర్‌ గతంలో చాలాసార్లు చెప్పారు. కేసీఆర్‌ ఇప్పుడు కామారెడ్డి, గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో రాజేందర్‌ కూడా ఈ రెండు స్థానాల్లో పోటీ చేస్తారని, ఆయన సిట్టింగ్‌ స్థానమైన హుజురాబాద్‌ నుంచి ఆయన భార్య పోటీ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా మేడ్చల్‌ స్థానం నుంచి జమున పేరు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వచ్చే ఎన్నికల్లో మేడ్చల్‌ స్థానం అత్యంత కీలకంగా మారబోతోంది. ఇక్కడ బీఆర్‌ఎస్‌ నుంచి మంత్రి మల్లారెడ్డి బరిలో ఉండబోతున్నారు. ప్రజల్లో మంచి ఫాలోయింగ్‌ ఉన్న తీన్మార్‌ మల్లన్న కూడా మేడ్చల్‌ నుంచి పోటీ చేయబోతున్నారు. స్టేట్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉన్న ఈటెల భార్య కూడా ఇప్పుడు ఈ స్థానం నుంచి పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో మేడ్చల్‌ పోరు అత్యంత ఆసక్తిగా మారబోతోంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలోనే కాబోతోంది. చూడాలి మరి ఈ త్రిముఖ పోరులో మేడ్చల్‌ స్థానాన్ని ఎవరు దక్కించుకుంటారో.