Telangana Congress : తెలంగాణ మార్పు కోరుకున్నా.. కాంగ్రెస్‌లో మాత్రం మార్పు లేదు..

రెండు టర్ములు బీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని చూసిన తరువాత తెలంగాణ సమాజం మార్పు కోరుకుంది. ఆ కోరిక రీసెంట్‌ ఎలక్షన్‌లో చాలా క్లియర్‌గా కనిపించింది. ఇక పని అయిపోయింది అనుకున్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో కంబ్యాక్ తీసుకుంది. అది మామూలు కంబ్యాక్‌ కూడా కాదు. అధికార పార్టీని పడగొట్టి ఏకంగా 64 సీట్లలో గెలిచేంత కంబ్యాక్‌. ఇది మామూలు విషయం కాదు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను మామూలుగా ఆధరించలేదు. ప్రజలు మార్పు కోరుకున్నా.. కాంగ్రెస్‌ పార్టీని నమ్మి అధికారం అప్పగించినా.. కాంగ్రెస్‌లో మాత్రం ఇప్పటికీ మార్పు రానట్టు కనిపిస్తోంది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచి రెండ్రోజులయ్యింది.

Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిస్తే.. ఏపీలో ఎందుకు ఉలికిపాటు..?

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సంగతి పక్కన పెడితే.. వాళ్ల సీఎం అభ్యర్థి ఎవరు అనేదే ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు కాంగ్రెస్‌ నేతలు. ఈ విషయంలో కాంగ్రెస్‌ సీనియర్ల మధ్య వాగ్వాదం కూడా జరినట్టు సమాచారం. ఒకరు సీఎం పదవి కోసం.. ఇంకొకరు మంత్రి పదవి కోసం అలకబూని కూర్చున్నారట. నాకు ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఆయనకు మాత్రం ఇవ్వకండి కారాలు మిరియాలు నూరుకుంటున్నారట. ముందు నుంచీ కాంగ్రెస్‌ పార్టీని ఈ వర్గపోరే ముంచింది. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే అందరికీ గుర్తొచ్చే డజను మంది సీనియర్లు. అంతా ముఖ్యమంత్రి అభ్యర్థులే. అలాంటి పార్టీలో ఒక్కరిని మాత్రమే సీఎంగా చేయడం పెద్ద టాస్క్‌ అనే చెప్పాలి. ఎవరికి సీఎం పోస్ట్‌ ఇచ్చినా మిగిలినవాళ్లు అలకపాన్పు ఎక్కేస్తారు. పార్టీ మారిపోయినా అశ్చర్యపోవాల్సిన పని లేదు.

పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే చాలు.. 24 గంటల్లో బీఆర్ఎస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు ఇదే టెన్షన్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. ఎవరూ హర్ట్‌ అవ్వకుండా కరెక్ట్‌ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసే పనిలో AICC బిజీగా ఉంది. ప్రజలు ఇంత మ్యాండేట్‌ ఇచ్చినా, తెలంగాణలో ప్రభుత్వాన్ని మార్చినా.. కాంగ్రెస్‌ పార్టీలో ఎలాంటి మార్పు రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక వీళ్లు జన్మలో మారరా అంటూ తలలు పట్టుకుంటున్నారు కామన్‌ పీపుల్‌.