EXIT POLLS: గంట ముందే ఎగ్జిట్‌ పోల్స్‌.. ఈసీ నిర్ణయంపై జనాల్లో ఉత్కంఠ..

గురువారం సాయంత్రం ఆరున్నరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాలని ముందుగా ఎన్నికల సంఘం సూచించినా.. ఇప్పుడు ఆ సమయాన్ని ఈసీ సవరించింది. సాయంత్రం ఐదున్నరకే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవ్వొచ్చని ప్రకటించింది. నిజానికి పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది.

  • Written By:
  • Publish Date - November 30, 2023 / 01:33 PM IST

EXIT POLLS: అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా.. తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఐతే అనుకున్న స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కాకపోవడం.. ఇప్పుడు అన్ని పార్టీలను టెన్షన్ పెడుతోంది. ఐతే చివరి రెండు గంటలే పోలింగ్‌లో కీలకం కాబోతున్నాయ్. ఇదంతా ఎలా ఉన్నా.. ఎగ్జిట్‌పోల్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ ముగిసిన అరగంట తర్వాతే ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇంతకుముందు ఆదేశాలు జారీ చేసింది.

Nagarjuna sagar: సాగర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేసుకున్న ఏపీ.. షాకిచ్చిన తెలంగాణ

గురువారం సాయంత్రం ఆరున్నరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాలని ముందుగా ఎన్నికల సంఘం సూచించినా.. ఇప్పుడు ఆ సమయాన్ని ఈసీ సవరించింది. సాయంత్రం ఐదున్నరకే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవ్వొచ్చని ప్రకటించింది. నిజానికి పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే సాయంత్రం ఆరున్నర తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని అక్టోబర్ 31న ఈసీ ముందుగా ఆదేశించింది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటలకే ముగుస్తుండడంతో.. సాధారణ సమయానికి మరో గంట ముందుగానే అంటే సాయంత్రం ఐదున్నరకే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేందుకు అవకాశం కల్పించింది. మరో నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా.. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలను సెమీఫైనల్స్‌గా భావిస్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ కనిపిస్తుండగా.. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరంలో ఏం జరగబోతుందని దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌పై బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది. తెలంగాణలో అయితే ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా కనిపిస్తోంది. దీంతో ఎగ్జిట్‌ పోల్స్ కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.