తెలంగాణలో ( Telangana elections ) మొదటిసారిగా ఎన్నికల బరిలో నిలవాలని జనసేన ( Jana Sena ) నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర ( BJP President ) అధ్యక్షుడు కిషన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) భేటీ తర్వాత తెలంగాణలోకి ఎంట్రీ అవ్వాలని నిర్ణయించింది. పొత్తుతో పాటు సీట్ల షేరింగ్ పై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. జనసేన మొదట 32 స్థానాల్లో నిలబడాలని అనుకుంది. అయితే ఇప్పుడు 8 స్థానాలపైనే ఏకాభిప్రాయం కుదిరింది. మరో రెండు స్థానాలపై ఇంకా చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికైతే ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట, కూకట్ పల్లి, మల్కాజిగిరి, కోదాడ, నాగర్ కర్నూల్ స్థానాల్లో జనసేన పోటీచేయాలని నిర్ణయించింది. శేరిలింగంపల్లి టిక్కెట్ కూడా అడిగినా… అక్కడి స్థానిక బీజేపీ ( BJP ) లీడర్ల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. దాంతో మల్కాజిగిరి సీటు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసింది. ఇప్పటికే మూడు లిస్టు లో 88 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఇంకా జనసేనకు ఇచ్చే సీట్లు మినహాయించి 20 నుంచి 22 సీట్ల దాకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పొత్తులు ఖరారు కావడంతో ఈ నెల 7న సికింద్రాబాద్ లో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలో పాల్గొనాలని పవన్ కల్యాణ్ ను కోరారు కిషన్ రెడ్డి. అందుకు పవన్ కూడా ఒప్పుకోవడంతో… సికింద్రాబాద్ లో బీజేపీ బీసీల ఆత్మగౌరవ సభలో మోడీ పక్కన.. పవన్ ను చూడబోతున్నాం.
CPM : తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగానే సీపీఎం పోటీ.. 14 అభ్యర్థుల తొలి జాబితా విడుదల..
తెలంగాణలో జనసేన మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలోకి అడుగుపెడుతుంది. 2014 మార్చి 14న జనసేన పార్టీని హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ ప్రారంభించారు.2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా… తెలంగాణలో ఇప్పటికే నిలబడలేదు. 2020లో గ్రేటర్ హైదరాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ ఇచ్చింది జనసేన. NDA భాగస్వామి అయిన జనసేన.. బీజేపీతోనే కలిసి నడుస్తామని అప్పట్లో ప్రకటించింది. ఇప్పుడు తెలంగాణలో సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పోటీకి గ్లాసు పార్టీ సిద్ధమైంది. తెలంగాణలోని సీమాంధ్రులు ఇప్పటి దాకా BRS కే సపోర్ట్ చేశారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాలు ఆ వర్గాల వారికి ఆగ్రహం తెప్పించాయి. చంద్రబాబు అరెస్ట్ విషయంలో మంత్రి కేటీఆర్ స్పందించిన తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత కేటీఆర్, హరీష్ సహా మిగతా మంత్రులంతా.. చంద్రబాబుకు సానుభూతి తెలిపేందుకు ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు. అలాగే తెలంగాణలో తెలుగుదేశానికి ఇంకా కార్యకర్తల బలం ఉంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు కూడా బాగానే ఉన్నాయి.
PAWAN KALYAN: బాబుతో పవన్ కీలక భేటీ.. ఎన్నికల కోసం దిమ్మతిరిగే వ్యూహం..
ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో.. ఆ ఓట్లన్నీ జనసేనకు పడతాయని బీజేపీ నమ్ముతోంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కు తోడు, టీడీపీ ఓట్లు కలిసొస్తాయని భావిస్తోంది. తెలంగాణలో సీట్లు గెలవకపోతే ఆ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ పై పడుతుందని మొదట జనసేన లీడర్లు భావించారు. కానీ బీజేపీ ఒత్తిడితో ఇక పోటీలోకి దిగక తప్పలేదు. ఇప్పుడు జనసేనకు ఇచ్చే 9 లేదా 10 సీట్ల విషయంలో ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ లీడర్లలో అసంతృప్తి చెలరేగే అవకాశాలు కూడా లేకపోలేదు. సీమాంధ్రులు, తెలంగాణలో బీజేపీ అభిమానులు ఓట్లు ఉంటే ఆయా నియోజకవర్గాల్లో జనసేన విజయం సాధిస్తుందని బీజేపీ నమ్ముతోంది.