HARISH RAO: కాంగ్రెస్‌ది 42 పేజీల మేనిఫెస్టో కాదు 420 మేనిఫెస్టో అని విమర్శించారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. గజ్వేల్ ప్రజ్ఞాపుర్ లో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.”కాంగ్రెస్ ఎలాగూ గెలిచేది లేదని అమలు సాధ్యం కానీ హామీలు ఇస్తున్నది. పేజీలకు పేజీలు రాశారు. అవన్నీ ఆచరణ సాధ్యం కాని హామీలు. కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత లేదు. కర్ణాటకలో కరెంట్ కష్టాలు చూస్తున్నాం.
RAHUL GANDHI: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో కులగణన: రాహుల్ గాంధీ
అక్కడి ప్రజలు అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. 420 మేనిఫెస్టోను కాంగ్రెస్ ప్రజల ముందుకు తెచ్చింది. జనం ఎక్కడ కొడతారో అని 24 గంటల కరెంట్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఈ ఆచరణ సాధ్యం కాని హామీలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ అమలు చేస్తున్నదా. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, గొర్రెల పంపిణీ ఇలా అందులో సగం మేము అమలు చేస్తున్నవే. బీఆర్ఎస్స్ మేనిఫెస్టోను కాంగ్రెస్ కాపీ కొట్టింది. అప్పులు సంతకం పెట్టి తెచ్చింది నువ్వే కదా ఈటెల రాజేందర్. రెండేళ్లు అరోగ్య మంత్రిగా చేశావ్. అప్పుడు కేసీఆర్ మంచోడు అన్నవ్. గొప్పొడు అన్నవ్. పార్టీ మారంగనే మాట మార్చావ్. గజ్వేల్ అభివృద్ధి చెందినట్టు.. హుజురాబాద్ చేసావా..? ఓట్ల కోసం జూటా మాటలు మాట్లాడుతున్నావ్. అన్నం పెట్టిన కేసీఆర్‌ను మోసం చేసింది నువ్వు, సున్నం పెట్టింది నువ్వు” అని హరీష్ వ్యాఖ్యానించారు.