TELANGANA CONGRESS: కాంగ్రెస్ రెండో జాబితా కోసం తీవ్ర పోటీ.. ఆశావహుల లిస్ట్ ఇదే..!

కొందరు సీనియర్లకు ఫస్ట్‌ లిస్ట్‌లో అవకాశం దక్కలేదు. మరి వారికి సెకండ్ లిస్ట్‌లో అయినా చాన్స్ దొరుకుతుందా.. లేదంటే సంచలనాలు ఉంటాయా అనే చర్చ జరుగుతోంది. చాలా నియోజకవర్గాల్లో తీవ్రమైన పోటీ ఉండడంతో.. అక్కడి అభ్యర్థులతో కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుతున్నారు.

  • Written By:
  • Publish Date - October 26, 2023 / 04:52 PM IST

TELANGANA CONGRESS: కాంగ్రెస్‌లో టికెట్ల కోసం భారీ పోటీ కనిపిస్తోంది. ఇప్పటికే ఫస్ట్‌ లిస్ట్ అనౌన్స్‌ చేసిన హస్తం పార్టీ.. సెకండ్ లిస్ట్ ప్రిపరేషన్‌లో చాలా బిజీగా ఉంది. ఇప్పటికే కొందరు సీనియర్లకు ఫస్ట్‌ లిస్ట్‌లో అవకాశం దక్కలేదు. మరి వారికి సెకండ్ లిస్ట్‌లో అయినా చాన్స్ దొరుకుతుందా.. లేదంటే సంచలనాలు ఉంటాయా అనే చర్చ జరుగుతోంది. చాలా నియోజకవర్గాల్లో తీవ్రమైన పోటీ ఉండడంతో.. అక్కడి అభ్యర్థులతో కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుతున్నారు. వారు అంగీకరించాక, కూల్ అయ్యాక సెకండ్ లిస్ట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో రెండో జాబితా ప్రాబబుల్స్ చూస్తే.. జడ్చర్ల నుంచి అనిరుధ్‌రెడ్డి, ఎర్రశేఖర్‌ మధ్య పోటీ ఉంది. మహబూబ్‌నగర్‌లో యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఒబెదుల్లా కొత్వాల్‌.. దేవరక్రదలో మధుసుధన్‌రెడ్డి, కాటం ప్రదీప్‌గౌడ్‌.. మక్తల్‌లో శ్రీహరి ముదిరాజ్‌, కొత్తకోట సిద్ధార్థ్‌రెడ్డి.. నారాయణపేటలో కుంభం శివకుమార్‌, ఎర్ర శేఖర్‌.. వనపర్తిలో చిన్నారెడ్డి, మేఘారెడ్డి మధ్య పోటీ కనిపిస్తోంది. దేవరకొండలో బాలు నాయక్‌కు.. భువనగిరిలో కుంభం అనిల్‌, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు, పాలేరులో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సత్తుపల్లిలో సంభాని చంద్రశేఖర్‌రావు, కోరుట్లలో జువ్వాడి నర్సింగరావు, కామారెడ్డిలో షబ్బీర్‌ అలీ, వరంగల్‌ ఈస్ట్‌లో కొండా సురేఖ, ఇబ్రహీంపట్నంలో మల్‌రెడ్డి రంగారెడ్డి, హుజురాబాద్‌లో బల్మూరి వెంకట్‌కు ఎలాంటి పోటీ లేదు.

ఇక సూర్యాపేటలో పటేల్‌ రమేష్, దామోదరరెడ్డి.. తుంగతుర్తిలో అద్దంకి దయాకర్‌, వడ్డేపల్లి రవి, ప్రీతమ్.. ఇల్లందులో కోరం కనకయ్య, ప్రవీణ్‌ నాయక్‌.. అశ్వరావుపేటలో తాటి వెంకటేశ్వర్లు, సున్నం నాగమణి.. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో రావి శ్రీనివాస్‌, అనిల్‌కుమార్‌, కృష్ణారెడ్డి.. ఆసిఫాబాద్‌లో శ్యామ్‌ నాయక్‌, ముర్సుకోలు సరస్వతి, రేణుక.. ఆదిలాబాద్‌లో కంది శ్రీనివాస్‌రెడ్డి, గండ్ర సుజాత.. చెన్నూర్‌లో నల్లా ఓదెలు, బొడ్డ జానార్థన్‌.. ఖానాపూర్‌లో భరత్‌ చౌహాన్‌, రేఖానాయక్‌.. బోధ్‌లో రాథోడ్‌ బాపురావు, నరేష్‌ జాదవ్‌.. ముథోల్‌లో ఆనందరావు పటేల్‌, పత్తిరెడ్డి విజయ్‌కుమార్‌.. కరీంనగర్‌లో కొత్త జైపాల్‌రెడ్డి, రోహిత్‌రావ్‌.. చొప్పదండిలో మేడిపల్లి సత్యం, భానుప్రియ.. నిజామాబాద్‌ అర్బన్‌లో ధర్మపురి సంజయ్‌, మహేష్‌కుమార్‌ గౌడ్‌.. నిజామాబాద్‌ రూరల్‌లో సుభాష్‌రెడ్డి, భూపతిరెడ్డి నర్సారెడ్డి.. బాన్సువాడలో కాసుల బాలరాజు, అనిల్‌కుమార్‌రెడ్డి.. ఎల్లారెడ్డిలో మదన్‌ మోహన్‌రావు, సుభాష్‌ రెడ్డి.. జుక్కల్‌లో గంగారాం, తోట లక్ష్మీకాంతరావు.. జనగామలో కొమ్మురి ప్రతాప్‌రెడ్డి, టీజేఎస్‌ కోదండరామ్‌… పరకాలలో కొండా మురళి, గాజర్ల అశోక్‌, ఇనిగాల వెంకట్‌రామిరెడ్డి.. డోర్నకల్‌లో నెహ్రూ నాయక్‌, రామ్‌ చంద్రనాయక్‌ పోటీ పడుతున్నారు.

వరంగల్‌ వెస్ట్‌లో నాయిని రాజేందర్‌రెడ్డి, జంగా రాఘవరెడ్డి.. మహబూబాబాద్‌లో బలరాం నాయక్‌, బెల్లయ్య నాయక్‌, మురళీ నాయక్‌.. పాలకుర్తిలో ఝాన్సీ రెడ్డి, తిరుపతిరెడ్డి.. వర్ధన్నపేటలో నాగరాజు, సిరిసిల్ల రాజయ్య.. నారాయణ్‌ఖేడ్‌లో సురేష్‌ షెట్కర్‌, సంజీవరెడ్డి.. నర్సాపూర్‌లో గాలి అనిల్‌కుమార్‌, ఆవుల రాజిరెడ్డి.. దుబ్బాకలో చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, కత్తి కార్తీక.. సిద్ధిపేటలో పూజల హరికృష్ణ, శ్రీనివాస్‌గౌడ్‌, భవానిరెడ్డి.. తాండూర్‌లో కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, మనోహర్‌రెడ్డి.. మహేశ్వరంలో పారిజిత నర్సింహారెడ్డి, చల్లా నర్సింహారెడ్డి.. శేరిలింగంపల్లిలో రఘునాథ్‌ యాదవ్‌, జగదీశ్వర్‌గౌడ్‌.. ఎల్‌బీ నగర్‌లో మధుయాష్కీగౌడ్‌, మల్‌రెడ్డి రాంరెడ్డి.. కూకట్‌పల్లిలో గొట్టిముక్కల వెంగల్‌రావు, సత్యం శ్రీరంగం.. రాజేంద్రనగర్‌లో జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌, గౌరీ సతీష్‌.. జూబ్లీహిల్స్‌లో అజారుద్దీన్‌, విష్ణువర్థన్‌రెడ్డి.. ఖైరతాబాద్‌లో రోహిన్‌రెడ్డి, విజయారెడ్డి.. అంబర్‌పేటలో మోత రోహిత్‌, నూతి శ్రీకాంత్‌గౌడ్‌.. కంటోన్మెంట్‌లో గద్దర్ కూతురు వెన్నెల, పిడమర్తి రవి టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. సెకండ్‌ లిస్ట్‌లో వీరిలో ఎవరి పేరు ఉంటుందని.. అటు కాంగ్రెస్‌ వర్గాలతో పాటు.. సామాన్యుల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది.