తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాదానికి గురైన విషయం అందరికీ తెలిసిందే. ఫాంహౌజ్‌లో కాలుజారి పడిపోయిన ఆయనకు.. డాక్టర్లు ఆపరేషన్ చేశారు. ఎడమ తొంటికి గాయం బలంగా తగలడంతో.. హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. దాదాపు నాలుగు గంటలు కష్టపడి డాక్టర్ సంజయ్ టీం ఈ ఆపరేషన్ చేసింది. ఆపరేషన్ జరిగిన 24 గంటల్లోనే కేసీఆర్‌తో వాకింగ్ చేయించారు డాక్టర్లు. హెల్త్ బులెటిన్‌తో పాటు ఈ వీడియో కూడా బయటికి వచ్చింది. కానీ అంతా ఈ వీడియోను నెగటివ్‌గానే అర్థం చేసుకున్నారు. నాలుగు గంటలు ఆపరేషన్ చేశారు అంటే.. ఖచ్చితంగా మేజర్ ఆపరేషన్ అయ్యి ఉంటుంది.
KTR : త్వరగా లేవండి నాన్న.. తండ్రిని తల్చుకుని KTR ఎమోషనల్ పోస్ట్..
అంత మేజర్ ఆపరేషన్ జరిగిన తరువాత.. 24 గంటలు కూడా కాకముందే కేసీఆర్ ఎలా నడుస్తారు. ఇదే ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్. కేసీఆర్ అంటే గిట్టని ప్రతీ ఒక్కరు ఈ విషయంలో ఆయనను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా ఉండేందుకు ఇలా నాటకాలు ఆడుతున్నారని అనరాని మాటలు అంటున్నారు. అయితే డాక్టర్లు చెప్తున్న విషయం ఏంటి అంటే.. కేసీఆర్‌కు జరిగింది చాలా సాధారణ ఆపరేషన్ అట. కాకపోతే ఆయనకు వయసు ఎక్కువగా ఉండటం కారణంగా ఆపరేషన్‌కు ఎక్కువ సమయం పట్టినట్టు తెలుస్తోంది. ఇకపోతే.. చాలా సందర్భాల్లో హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకున్న పేషెంట్లు దాదాపుగా అదే రోజు డిస్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోతారట. ఆస్తమా, డయాబెటిస్ లాంటి రోగాలు ఉన్న పేషెంట్లు మాత్రం బెడ్ రెస్ట్ తీసుకుంటారట.
ఇక వాకింగ్ విషయానికి వస్తే.. ఈ ఆపరేషన్ జరిగిన తరువాత ఖచ్చితంగా పేషెంట్‌తో వాకింగ్ చేయించాల్సి ఉంటుంది అంటున్నారు డాక్టర్లు. రీప్లేస్‌మెంట్ జరిగ్గా జరిగిందా లేదా.. బోన్ సరిగ్గా లోకేట్ అయ్యిందా అని తెలుసుకునేందుకు ఇలా వాకింగ్ చేయిస్తారట. వాకింగ్ చేయించకపోతే సెట్ చేసిన ఎముకలు బిగుసుకుపోయే ప్రమాదముందంటున్నారు డాక్టర్లు. ఈ కారణంగానే ఆపరేషన్ తరువాత కేసీఆర్‌తో వాకింగ్ చేయించామని చెప్తున్నారు. దీంతో కేసీఆర్‌ను ఆభిమానించేవాళ్లంతా ట్రోల్స్ చేసేవాళ్లను తిట్టిపోస్తున్నారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా పెద్దమనిషి ఆరోగ్యం గురించి జోకులేస్తారా అంటూ చీవాట్లు పెడుతున్నారు.