ఎన్నికల నోటిఫికేషన్ (Notification) వచ్చినప్పటి నుంచి.. పటాన్‌చెరు నియోజకవర్గంపై జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. కేటీఆర్ (KTR) కు సన్నిహితుడిగా పేరు ఉన్న నీలం మధు.. బీఆర్ఎస్ తరఫున ఇక్కడి నుంచి టికెట్ ఆశించారు. ఐతే నిరాశే ఎదురైంది. దీంతో కారు పార్టీకి రాజీనామా చేసిన మధు.. ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఐతే కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన హామీతో హస్తం గూటికి చేరారు నీలం మధు. పటాన్‌చెరు టికెట్ కూడా కేటాయించారు. రెండు దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న కాటా శ్రీనివాస్ గౌడ్‌ను పక్కన పెట్టి మరీ.. ఈ మధ్య పార్టీలోకి వచ్చిన నీలం మధుకు అవకాశం కల్పించింది కాంగ్రెస్.
Congress Third List : కాంగ్రెస్ మూడో జాబితా విడుదల.. అసంతృప్తి నేతల ఆందోళన..
దీనిపై జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. కాటా శ్రీనివాస్ గౌడ్‌కు టికెట్ ఇప్పించేందుకు మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా (Damodara Narasimha) చాలా ప్రయత్నాలు చేశారు. అలాంటిది దామోదరను హర్ట్ చేసి మరీ.. నీలం మధుకు టికెట్ ఇవ్వడం ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. అయితే సామాజిక వర్గ సమీకరణాలు, సర్వేల ఆధారంగా నీలం మధుకు టికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి నీలం మధు బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు.. గ్రౌండ్‌లో ఆయనకు ఉన్న బలం, సొంత సామాజికవర్గం పార్టీకి బలం అవుతుందని భావించిన కాంగ్రెస్.. ఆయనకు టికెట్ కేటాయించినట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో నీలం మధు కీలకంగా వ్యవహరించారు. తాను సర్పంచ్‌గా పనిచేస్తున్న గ్రామాన్ని.. అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు మధు.
TELANGANA CONGRESS: నీలం మధుకు టికెట్ ఇవ్వడంపై.. పటాన్‌చెరు కాంగ్రెస్‌లో మంటలు..
దీంతో పాటు పటాన్ చెరు (Patan Cheru) నియోజకవర్గంలో ప్రతీ గ్రామంలో NMR యువసేన పేరుతో చేస్తున్న సేవా కార్యక్రమాలు.. నీలం మధుకు జనాల్లో మంచి పేరు తీసుకువచ్చాయి. పార్టీకి సంబంధం లేకుండా.. వ్యక్తిగతంగా దాదాపు 50వేల మంది NMR యువసేన కార్యకర్తలు ఉండడం.. నీలం మధుకు మరో ప్లస్. నియోజకవర్గంలోని ప్రతీ సామాజికవర్గం ఓటర్లలో.. నీలం మధు మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. వీటన్నింటికి తోడు ముదిరాజ్ అయిన నీలం మధుకు టికెట్ కేటాయించడం ద్వారా.. తెలంగాణలో ఉన్న 60 లక్షల అదే సామాజిక వర్గానికి చెందిన ఓటర్లును ఈజీగా ఆకర్షించే అవకాశం ఉంటుంది. పైగా కాంగ్రెస్ చేపట్టిన సర్వేలోనూ నీలం మధుకే ఎడ్జ్ ఉన్నట్లు కనిపించింది. అందుకే నీలం మధుకు టికెట్ కేటాయించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కల సంగతి ఎలా ఉన్నా.. నీలం మధ్య టికెట్ కేటాయించడం ద్వారా.. పటాన్‌చెరు కాంగ్రెస్‌లో మంటలు మొదలయ్యాయ్. ఇవి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్న టెన్షన్.. హస్తం పార్టీని వెంటాడుతోంది.