Ponnam Prabhakar: హుస్నాబాద్‌ కాంగ్రెస్‌లో కొత్త రచ్చ.. పొన్నంకు ఎదురుగాలి తప్పదా..?

కాంగ్రెస్ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ టికెట్ కోసం పోటీ పడ్డారు. ఐతే అధిష్టానం మాత్రం పొన్నం ప్రభాకర్‌కే టికెట్ కేటాయించింది. దీంతో అలిగిరెడ్డి వర్గం అలిగింది. తీవ్రంగా రియాక్ట్ అయింది. నాన్‌ లోకల్ వ్యక్తులకు ఎలా టికెట్ కేటాయిస్తారని ప్రశ్నిస్తోంది.

  • Written By:
  • Publish Date - October 29, 2023 / 07:31 PM IST

Ponnam Prabhakar: ఒకప్పుడు ఎర్రజెండ పార్టీలకు కంచుకోటగా ఉన్న హుస్నాబాద్.. ఆ తర్వాత మార్పు చెందుతూ వచ్చింది. ప్రస్తుతం హుస్నాబాద్ నియోజకవర్గం మొత్తంలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్, సిపిఐ, బీజేపీ ప్రధానంగా ఉన్నాయ్. ఇలాంటి హుస్నాబాద్ నియోజకవర్గంలో వొడితల సతీష్‌ వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్‌ నుంచి విజయం సాధించారు. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని ధీమాగా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో కేసీఆర్ ప్రచార సభ కూడా హుస్నాబాద్ నుంచే మొదలుపెట్టారు.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా హుస్నాబాద్ నియోజకవర్గంపై అందరికీ ఆసక్తి పెరిగిపోయింది. అన్ని రాజకీయ పార్టీలు హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూస్తున్నాయ్. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా సతీష్ కుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ టికెట్ కోసం పోటీ పడ్డారు. ఐతే అధిష్టానం మాత్రం పొన్నం ప్రభాకర్‌కే టికెట్ కేటాయించింది. దీంతో అలిగిరెడ్డి వర్గం అలిగింది. తీవ్రంగా రియాక్ట్ అయింది. నాన్‌ లోకల్ వ్యక్తులకు ఎలా టికెట్ కేటాయిస్తారని ప్రశ్నిస్తోంది. తన ప్రధాన కార్యకర్తలతో ప్రవీణ్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. కొన్ని నెలల నుంచి హుస్నాబాద్ నియోజకవర్గంలో కార్యకర్తలను, నేతలందరినీ ఏకం చేసి పార్టీని గెలుపు తీరాలకు తీసుకువచ్చానని.. టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కాంగ్రెస్‌ తనను మోసం చేసిందని ప్రవీణ్‌ రెడ్డి ఆరోపిస్తున్నారు. రెండుసార్లు కాంగ్రెస్ తనను మోసం చేసిందని పదేపదే అంటున్న ప్రవీణ్‌.. తిరుగుబాటు బావుటా ఎగురవేసేందుకు సిద్ధం అవుతున్నారు.

ఒకటి, రెండు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించేందుకు రెడీ అయ్యారు. దీంతో హుస్నాబాద్ కాంగ్రెస్‌లో రగడ మొదలైంది. కాంగ్రెస్‌లో గ్రూప్‌ వార్ స్టార్ట్ అయింది. ఇది ఇలానే కంటిన్యూ అయితే.. కాంగ్రెస్ ఓట్లు చీలిపోయి పొన్నంకు ఎదురుగాలి వీయడం ఖాయం. బీఆర్ఎస్‌ విజయం సాధించడం కూడా ఖాయం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రవీణ్‌ రెడ్డిని కూల్‌ చేసేందుకు కాంగ్రెస్ ఏం చేయబోతుంది..? ఎలాంటి హామీలు ఇవ్వబోతుంది..? అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే రెండుసార్లు మోసపోయానంటున్న ప్రవీణ్.. కాంగ్రెస్ బుజ్జగింపులకు కూల్ అవుతారా లేదా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలింది.