తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా పవర్‌ఫుల్ నేతల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒకరు. ప్రస్తుతం మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో కొండంగల్, కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే రెండు చోట్లా నామినేషన్ వేసి ప్రచారం కూడా ప్రారంభించారు. నామినేషన్‌లో భాగంగా తన ఆస్తుల వివరాలు ఎన్నికల అధికారులకు సమర్పించారు రేవంత్ రెడ్డి. ఈ వివరాల్లో రేవంత్ రెడ్డి దగ్గర రెండు గన్స్ ఉన్నాయని తెలియడం.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఆయన ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. రేవంత్ రెడ్డి అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం.. రేవంత్ రెడ్డి దగ్గర ప్రస్తుతం 5 లక్షల 34 వేల నగదు వుందట. అలాగే రేవంత్, ఆయన భార్య గీతా రెడ్డి పేర్ల మీద కలిపి వున్న స్థిర , చర ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ 30 కోట్ల 95 లక్షల 52 వేల 652గా ప్రకటించారు రేవంత్ రెడ్డి. అలాగే తనపై 89 పెండింగ్ కేసులున్నట్టె అఫిడవిట్‌లో మెన్షన్ చేశారు.
KCR speech : కేసీఆర్ స్పీచ్ లో దమ్ము ఏది ..? కాంగ్రెస్ పై వ్యతిరేకత పెంచడమే లక్ష్యం..!
ఇక రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న గన్స్ వివరాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. రేవంత్ రెడ్డి దగ్గర రెండున్నల లక్షలు విలువ చేసే రెండు గన్స్ ఉన్నాయట. రెండు లక్షలు విలువ చేసే ఓ పిస్టల్.. 50వేలు విలువ చేసే ఓ రైఫిల్ తన దగ్గర ఉన్నట్టు చెప్పారు రేవంత్ రెడ్డి. అలాగే రేవంత్ దంపతుల పేర్ల మీద కోటీ 30 లక్షల 19 వేల 901 మేర అప్పులు వున్నట్లు వెల్లడించారు. ఇక తన వద్ద ఒక హోండా సిటీ, మరో మెర్సిడెస్ బెంజ్ ఉన్నాయని చెప్పారు. రేవంత్ రెడ్డి భార్య వద్ద 83 లక్షల 36 వేల విలువైన బంగారం. 7 లక్షల 17 వేల 800 విలువైన నెక్లెస్‌లు. 9 వేల 700 గ్రాముల వెండి, వెండి వస్తువులు ఉన్నట్టు చెప్పారు రేవంత్ రెడ్డి.