ఈటల.. తెలంగాణ రాజకీయాల్లో ఇది పేరు మాత్రమే కాదు.. ఓ బ్రాండ్. అలాంటి పేరు తెచ్చుకున్నారు ఆయన! సౌమ్యుడిగా, వివాదరహితుడిగా ఉన్న ఈటల.. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. తన దూకుడు ఏంటో చూపించడం మొదలుపెట్టారు. బీజేపీలో చేరిన తర్వాత.. కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అన్నారు. బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న ఈటలకు.. ఎన్నికల్లో చేదు అనుభవాలు ఎదురయ్యాయ్. కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించాలని.. ఈటల తన సొంత నియోజకవర్గంతో పాటు గజ్వేల్‌లోనూ పోటీ చేశారు. హుజురాబాద్‌లో తనకు తిరుగు ఉండదని భావించిన ఈటల.. ఎక్కువ గజ్వేల్‌పైనే ఫోకస్ పెట్టారు. అదే కొంప ముంచింది. రెండుచోట్ల ఓటమికి కారణం అయింది.
సినిమా రేంజ్‌లో రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ.. భార్య కోసం ఎన్ని ఫైట్‌లు చేశాడో తెలుసా..
ఈటల రెండు చోట్ల ఓడిపోవడం.. ప్రతీ ఒక్కరిని షాక్‌కు గురిచేసింది. గజ్వేల్ ఫలితం ఎలా ఉన్నా.. సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లో మాత్రం ఈటల గెలుపు ఖాయమని అంతా భావించారు. ఐతే ఎవరూ ఊహించని విధంగా ఈటల పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఈటల ఓటమికి కారణం అతి విశ్వాసమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. 2004 నుంచి ఇప్పటివరకు ఈటల వరుసగా గెలుస్తూ వచ్చారు. మూడుసార్లు ఉప ఎన్నికల్లో, నాలుగు సాధారణ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటారు. ఐతే ఈసారి పూర్తిగా గజ్వేల్ మీదే ఫోకస్ పెట్టిన ఈటల.. హుజురాబాద్‌ను పక్కనపెట్టారు. ఆయన తరఫున ఆయన భార్య, కోడలు ప్రచారం నిర్వహించినా.. ఆయన లేని లోటు, ఆయన రాని లోటు అలాగే ఉండిపోయింది. దీంతో ఫలితం రివర్స్ అయింది. హుజురాబాద్‌లోనూ ఓటమే పలకరించింది. హుజురాబాద్‌లో ఈటల గెలిచినా.. మళ్లీ గజ్వేల్‌కే వెళ్తారనే ఒక ప్రచారం జనాల్లోకి వెళ్లింది. దీంతో ఈటలకు బదులలు కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్‌ను ఎంచుకున్నారు ఓటర్లు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడంతో… బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి ఈజీగా విజయం సాధించారు