విజయశాంతి (Vijayashanthi) అలియాస్ రాములమ్మ (Ramulamma) .. సినిమాల్లో స్టార్ (Lady Superstar), రాజకీయాల్లో స్టార్ట్ క్యాంపెయినర్. ఐతే ఇదంతా ఒకప్పుడు. పార్టీల మీద పార్టీలు మారిన రాములమ్మ.. ఇప్పుడు మళ్లీ పార్టీ మారబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఉన్నట్లే కానీ లేనట్లు అన్నట్లు బీజేపీలో ఉన్న విజయశాంతి.. త్వరలో కమలం పార్టీకి హ్యాండ్ ఇచ్చి.. కాంగ్రెస్‌కు చేయి అందించనున్నారని.. హస్తం పార్టీ ఫైనల్ లిస్ట్‌లో ఆమె పేరు కూడా ఉంటుందనే ప్రచారం జరుగుతున్న వేళ.. కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీలో ఉన్నా, బయటికి వెళ్తామన్నా.. ఏదీ పట్టించుకోం అన్నట్లుగా ఉంటుంది బీజేపీ తీరు. రాములమ్మ విషయంలోనూ కమలం పార్టీ అలానే వ్యవహరిస్తోంది.
CM KCR: సీఎం కేసీఆర్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్.. తప్పిన పెను ప్రమాదం..
తెలంగాణలో స్టార్ట్ క్యాంపెయినర్ లిస్ట్ అనౌన్స్ చేసిన బీజేపీ.. విజయశాంతిని పక్కనపెట్టింది. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో విజయశాంతికి ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతటి ఫాలోయింగ్ రాములమ్మ.. పువ్వు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది వ్యూహాత్మకమా.. లేదంటే పక్కా ప్లాన్‌తో ఇలా చేశారో తెలియదు గానీ.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో రాములమ్మ పేరే కనిపించలేదు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఆమె స్టార్ క్యాంపెయినర్. అలాంటిది కాషాయ పార్టీ మాత్రం విజయశాంతిని పక్కన పెట్టేసింది. దీనికి పార్టీ సీనియర్లు కొందరు జంపింగ్ జపాంగ్ అనడమే కారణంగా తెలుస్తోంది. ఈ మధ్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి మైండ్ బ్లాంక్ ట్విస్ట్ ఇచ్చి మరీ కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు విజయశాంతి కూడా అదే దారిలో ఉన్నట్లు కమలం పార్టీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో రాములమ్మకు చోటు దక్కనట్లుగా సమాచారం.
Vijayashanti : కాంగ్రెస్ లోకి విజయశాంతి.. ! థర్డ్ లిస్ట్ లో పేరు ఉండే ఛాన్స్ ..!!
ఇక అటు తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ తరపున 40మంది ప్రచారం చేయనున్నారు. ఈ లిస్ట్‌లో ప్రధాని మోదీ, నడ్డా, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప తో పాటు కీలక జాతీయ నేతలు ఉన్నారు. రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల, రాజాసింగ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఎంపీ అర్వింద్, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వరెడ్డి క్యాంపెయినర్ లిస్ట్‌లో ఉన్నారు. క్యాంపెయినర్ లిస్టులో విజయశాంతికి చోటు దక్కలేదు. దీంతో పాటు అభ్యర్థిగా ఏ నియోజకవర్గం కేటాయించలేదు. దీంతో ఆమె బీజేపీలో ఉంటారా.. లేదంటే జంప్ జిలానీ అంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.